Wednesday, March 27, 2019
Home > tsahityam

|| పల్లె || -ఆకుల రాఘవ.

|| పల్లె || పల్లె మెలుకుంటే ప్రగతి వెల్లి విరియు! ప్రగతి వెల్లి విరిస్తే కండ పుష్టి ఈ దేశం! పల్లె కొక్క చెరువు జలం జీవ చలనం! ఇంటి కొక్క చెట్టు పచ్చదనం పెంచు! మోట బావిచేదబావి కలిగి ఉంటే జలం పొంగు! సాగుబడి కూలి పని కలిసి సాగుతుంటే సిరిలు దొర్లి ఇండ్లు నిండు! కుల వృత్తులు చేతి వృత్తులు పురుడు పోసుకుంటుంటే పల్లె కళలకాంతులు చిందు! చినుకు ఒడ్సి పడితే పుడమి తాగి ఊట చిమ్ము! సాగునీరు తాగునీరు స్మృద్దిగా నిల్వ వుండు! కరువు పటా పంచ లై పల్లె అన్న పూర్ణగా వెలుగు! పశువులు గొర్లు మేకలు మందలుగా

Read More

|| ‘అమ్మ’ మణి పూసలు || -వెన్నెల సత్యం

అపురూపం మనకు అమ్మ రానీయకు కంటి చెమ్మ ఆమె కంట ఆనందమె నీ బతుకుకు అర్థమమ్మ! తన ఒడిలో పెంచె నిన్ను తన ప్రేమే వెన్ను దన్ను నీ విజయపు అంచులకై చూపుతుంది నీకు మిన్ను! అద్దంలో చందమామ ఆకలిలో తల్లి ప్రేమ చూపి నట్టి అమ్మ నిపుడు మనము ఆదరించ లేమ! అమ్మ ఇచ్చినట్టి పాలు అయ్యె నేడు నేల పాలు ఆమె పలకరింపు లేక నేడు ఆశ్రమాల పాలు! అమ్మ కప్పి నట్టి కొంగు ఆకాశం దాని రంగు ఆ క్షణము తల్చు కుంటె ఆనందమున ఎద పొంగు!

Read More

|| మీ ఇష్టం || -అభిరామ్

|| మీ ఇష్టం || నా మనసు కొమ్మపై కూర్చున్న ఆలోచనల తేనెటీగలలో అలజడి రేపి కోరికల తుట్టెను కదిపి మధుర భావాల తేనెను కవిత్వంగా పిండి పాఠకుల మనసుకు అందించాను ఆస్వాదించి అభినందనలు తెలుపుతారో తేనెటీగలను నిలువు దోపిడీ చేసిన దొంగని బిరుదు ఇస్తారో మీ ఇష్టం -అభిరామ్ 9704153642

Read More

|| మాట విలువ || -రాజశేఖర్ పచ్చిమట్ల

|| మాట విలువ || మాట వలన పెరుగు మమతలు బంధాలు మాట వలన మనకు చేటు గలుగు మనషు లాచి తూచి మాటాడ వలయును పచ్చిమట్లమాట పసిడిమూట మాట మనిషి లోని మాలిన్య మునుతుంచు మాట మనుషు లందు మమత బెంచు మాట వలనె మనకు మర్యాధ ప్రాప్తించు పచ్చిమట్లమాట పసిడిమూట మాట మధుర మైన మంచి మిత్రుల నిచ్చు మాట కఠిన మైన మనసు విరుచు మాట శక్తి దెలిసి మసలుకున్నమేలు పచ్చిమట్లమాట పసిడిమూట మాటవలన మనిషి మాన్యుడయివెలుగు మనిషి విలువ పెరుగు మాట వలన మనిషి

Read More

|| ఎడారి పువ్వు || -ప్రీతీ నోవెలిన్ నోముల (పార్ట్ 4)

ఇంట్లోకి రమ్మని అడిగితే పనుందని చెప్పి సంధ్య వెళ్ళిపోయింది...కాసెపటివరకు గేట్ దగ్గరే నిలబడిపోయాను సంధ్య మాటలు గుర్తొచ్చి...తరువాత నెమ్మదిగా ఇంట్లోకి వెళ్లాను..లోపలికి వెళ్ళేసరికి నాన్న భోజనం చేస్తున్నారు...మీకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అతి ముఖ్యమైన వ్యక్తి మా నాన్న... అమ్మ కడుపులో ఉన్నప్పుడు నాతో మాట్లాడిన మొదటివ్యక్తి నాన్న...అప్పటి నుండి నేను ఎక్కువగా మాట్లాడిన వ్యక్తి కూడా నాన్నే.. మామూలుగా నేను మాట్లాడ్డం తక్కువ కానీ నాన్న ఎదురుగా ఉంటే ఎన్నో విషయాలు

Read More

||నాలో నేను|| -భండారి అంకయ్య(పార్ట్ -4)

నా మీద ఎండపొడ పడుతుంటే తెలివైంది. లేచి కూచున్న. ఇంతల అవ్వ నా దగ్గరకొచ్చింది. "లే... లే.. జల్దీ మొకం కడుక్కో . మేమంతా తానాలు కూడా చేసినం . నువ్వొక్కనివే మిగిల్నవ్". నాకు రాత్రి వాళ్ళ మాటలు యాదికొచ్చి దబ దబ పోయి పండ్లు తోముకొని నల్ల దగ్గర కూచున్న. అవ్వ నాలుగు చెంబుల నీళ్లు పోసింది అప్పటికే అవ్వ, దాద స్నానం చేసి,ఆంజనేయ స్వామి, సత్యనారాయణ

Read More

||విరుద్దతత్వాలు|| -అనూశ్రీ

ఆడంబరాల గదిలో ఆదమరచి నిద్రిస్తూ అందమైన కల రాలేదని ఆవేదన పడే విపరీత ధోరణి నీది ప్రశాంతంగా పదినిముషాలు కాలాన్ని మరిచి విశ్రమించాలనే ఆలోచన నాది... తప్పులని వేలెత్తి చూపుతూ ఎదుటి మనిషిని తక్కువ చేస్తూ పదునైన మాటల్ని విసిరి చురుకైన తత్వమనుకునే తృప్తి నీది.... కష్టాన్ని చూసి కరిగిపోవడం సందర్భానికి స్పందించడమే అసలైన నైజమనే భావన నాది.. అతుకుపడని విరుద్ద తత్వాలమైనా అరమరికలతో అలజడులు తలేత్తినా కలిసిసాగాలనే యోచన నాది నా ఆలోచన మీదే తిష్టవేసి రంగులు మార్చుతున్న స్నేహం నీది.. అయినా సరే మార్పులేమైనా చేరి హృదయాంతరాలలో ఏనాటికైనా నిన్ను నీవు చూసుకుని తెలుసుకోవాలని వేచి చూస్తూ నడుస్తున్నా

Read More

|| మన్నించు ప్రియా..! || -కయ్యూరు బాలసుబ్రమణ్యం

ఎడబాటైనా, తడబాటైనా మన్నించు.. నీ ప్రేమతో విరహమైనా, కలహమైనా మన్నించు.. నీ లాలనతో ద్వేషమైనా, దూషణైనా మన్నించు.. నీ పలుకుతో కోపమైనా, తాపమైనా

Read More

|| తీరం చేరువలో… || – చల్లగాలి శ్రీనివాస్

అళవై వస్తావో.... అల్లుకు పొతావో.... కాదని ఒంటరిని చెస్తావో.... ఆశగా నీ జతకై ఎదురు చూస్తూనే.... ని తీరం చేరువలో.... నిను చెరాలనె ఆరాటం నిలో తడిసిపొవాలనె తన్మయత్వం నిత్యం నాలో.... ఓ చల్లగాలి! - చల్లగాలి శ్రీనివాస్

Read More
error: Content is protected !!