|| ఎంగిలి మెతుకులు పడుతున్నయ్ || -కర్ణాకర్ యాదవ్
ఎంగిలి మెతుకులు పడుతున్నయ్ బాంచన్ గిరి చేసే దోరబానిసలకి.. యేరుకోండి యేరుకోండి ఆకులు నాకుతూ వారి మూతులు నాకుతుండే పరపీడన నాయకుల్లారా... నీ జాతిగౌరవం వారి ఆత్మగౌరవం దోరయెంగిలిమెతుకుల బానిసపదవులముందు ప్రతినిత్యంపాదపూజలేకదా అనునిత్యం దోర రాజ్యపు భజనకీర్తనలేకదా.. పక్కలు పరిచి చెప్పులు మోసి మోకాలిచిప్పలపై దోరసానికాల్లముందు మోకరిల్లే మూర్ఖులారా... యెంగిలి మెతుకులు పడుతున్నాయ్... రెపటి ఎలక్షన్ల నీ జాతి వోట్లకి నీ చైతన్యపు బతుకులకి సమాధిచేయ పునాది పడుతోన్నయ్ పదవులపేర పథకాలపేర... యెంగిలిమెతుకుల వలలమాటున... జర ఇకనైన మేలుకోండ్రి మాటలమాంత్రికనాయకుల మోసపుహామీలముసుగులనుండీ.. వారీ పీఠాలని పెకిలించే శక్తులై సమసమాజాన్ని నిర్మించే వోటరు విజ్ఞులై.. -కర్ణాకర్ యాదవ్
Read More