Wednesday, July 6, 2022
Home > కథలు

|| నిర్ణయం || -వి. సునంద

వాసంతికి అస్సలు నిద్ర పట్టడం లేదు. ''ఎలా చెప్పాలి... ఎలా ఒప్పించాలి..? ఆలోచనల దాడితో కంటి పై రెప్ప పడటానికి ఇష్ట పడటం లేదు. దాహంగా అనిపించి నీళ్ళు తాగుదామని లేచిన కమలకు ''పై కప్పును చూస్తూ అస్థిమితంగా అటూ ఇటూ కదులుతున్న కూతురు కనిపించింది. ''ఇంకా నిద్ర పోలేదా అంటూ గోడ గడియారం వైపు చూసింది టైమ్ ఒంటిగంట.. అదేమిటే రేపు కాలేజీ వుంది కదా ' ఏమాలోచిస్తున్నావు పడుకో

Read More

|| పాతచీర || -వి. సునంద

సావిత్రమ్మ చాలా దిగులుగా వుంటోంది ఈమధ్య. ఆమెలో మునుపటి ఉత్సాహం, చలాకీతనం మచ్చుకైనా కనబడటం లేదు. రోజూ చేసే పనులను తప్పదన్నట్టు చేస్తుంతదే తప్ప దేనిపై ఆసక్తి చూపడం లేదు. ఇదంతా భర్త రఘురాం గమనిస్తూనే ఉన్నాడు. పిల్లలు పండక్కొచ్చి వెళ్ళిన తర్వాత నాల్గురోజులు బాగానే ఉంది. ఆ తర్వాత ఏమయిందో! ఏమో!? తిండి సరిగా తినడం సేదు. నిద్ర సరిగా పోవడం లేదు. పని అలసటా అంటే అదీ కాదు.

Read More

|| జానకి విముక్తి || -వి. సునంద

జానకమ్మకు అస్సలు నిద్ర పట్టడం లేదు. ఇది ఇవాల్టి సమస్య కాదు. భర్త పోయినప్పటి నుండీ వుంది.... ఆయన ఉన్నప్పుడు ఆయన మాటలకు భయపడి తనకూ గౌరవమిచ్చే వాళ్ళు. తనే ఎప్పుడూ పిల్లల్ని వెనకేసుకొస్తూ.. ఎందుకండీ! అలా గట్టిగట్టిగా మాట్లడుతారూ! వాళ్ళకూ పెళ్ళిళ్ళయి పిల్లలూ అవుతున్నారు '' ఆ మాటకు తనమీద ఇంతెత్తున లేచి పెళ్ళిళ్ళయితే మాత్రం నా కంటే పెద్దోళ్ళయినట్టా... వాళ్ళు నా అంతయినా మనకంటే చిన్నోళ్ళే కదా పిచ్చి

Read More

ఇంటి దొంగలున్నారు జాగ్రత్త! -వి. సునంద

అమ్మూ! అందరికీ భోజనాలు పెడుతున్నా, చదివింది చాలుగానీ రా! ఆ తర్వాత మళ్ళీ చదువుకుందువుగానీ. డైనింగ్ హాల్లోంచి కేకేసింది సుభద్ర. ఆఇంట్లో ఉదయం ఎవరికి వారే పరుగులు తీసినా రాత్రి భోజనం కలిసి చేయాలనే రూల్ పెట్టుకొని తు. చ. తప్పకుండా పాటిస్తున్నారు. ఇలాంటి నిర్ణయం శివరామ్ కు మొదట్లో నచ్చలేదు. తనది ప్రైవేట్ కంపెనీలో డ్యూటీ. పిల్లలను ఇద్దరినీ పేరున్న స్కూల్లో చేర్పించాడు. ఖర్చు తడిసి మోపెడవుతుండటం. దీనికి తోడు సిటీలో

Read More

|| దారి చూపిన కళ || -వి. సునంద

పేపర్లో ఆ వార్త చూడగానే సాధన మనసు ఒక్కసారిగా గతంలోకి పరుగెత్తినది... ఎలాగైనా వీలు చూసుకొని వెళ్ళాలి. అందులో... అందులో నన్ను నేను వెతుక్కోవాలి.... రోజంతా అదే ఆలోచన... షాపుకెళ్ళింది. అన్నింటి వంకా తృప్తిగా చూసుకుంది... సాధనను వింతగా చూస్తూ "మేడమ్! మీరివాళ ఏదో ఆలోచనలలో తేలిపోతున్నట్టుగా వున్నారు.. అదేంటో చెప్పరా!" కొంచెం చనువుగా అంటున్న పార్వతిని చూస్తూ విడివడని నవ్వు మొహంతో "ఆ తర్వాత చెబుతాను గానీ ఓ నాలుగు రోజులు షాపును

Read More

!!కొంచం నమ్మకమివ్వు అవ్వా !! -పుష్యమీ సాగర్

అకుంఠిత దీక్ష గా తునికాకు ని బీడీ గ చుట్టే పన్లే వడ్డాది మల్లవ్వ. చిన్నప్పటి సంధి ఎర్కైన పని గిదొక్కటే. చిన్నతనాన అవ్వ నాయన ఇంగా అల్లా కాందాన్ అంత గిదే పని. ఇగ మల్లవ్వ ఇల్లేమో గొప్ప చారిత్రిక నేపథ్యం గల బోనగిరి లో సమ్మద్ చౌరస్తా లో మొదటి గల్లీ లో ని ఇంట్ల వుండే... మల్లవ్వ కి చిన్న వయసు లో నే లగ్గం

Read More

మాకూ మనసుందంటే…! -వి. సునంద (యదార్ధ సంఘటన)

అబ్బబ్బా! ఏం ప్రయాణమో ఏమో! ఒంట్లో ఓపిక లేదు రాను తమ్ముడూ' అంటే అస్సలు వినిపించుకోలేదు. ఙిల్లా కవులందరికీ అడ్మిన్ వి. "నీవు రాకపోతే ఎలాగక్కయ్యా?" అంటే తప్పని సరై బయలు దేరింది.. 'ముందుగ మురిసినమ్మపండుగ గుర్తెరగలేదన్నట్టు' అందరినీ. ఉత్సాహ పరిచింది తనే.. కానీ ఈ జలుబు హఠాత్తుగా ఒంట్లో చేరె.. "పడిశం పదిరోగాల పెట్టని" మనిషిని మనిషిగా వుండనియ్యదయ్యె. ఇప్పుడిప్పుడే బాల కవులుగా ఉనికిని చాటుకుంటున్న పిల్లలకు మహా ఉబలాటంగా వుంది.. "మేడమ్

Read More

సజీవం! -స్వాతీ శ్రీపాద

లైట్ ఆఫ్ చేసి పడుకున్న మానసకు ఏమీ తోచలేదు...నిద్రవచ్చే సూచనలూ లేవు. పదకొండు దాటింది. అటుమసిలి ఇటు మసిలి లేచి ఏసీ ఆన్ చేసి మళ్ళీ పడుకుని ...చలిగా ఉందని కంఫర్టర్ కప్పుకుని ... మళ్ళీ వేడిగా అనిపించి కాళ్ళతో దాన్ని తన్నేసి మళ్ళీ లేచి కూచుంది. లాప్ టాప్ తెరవబుద్ధి కాలేదు. పక్కనే బెడ్ సైడ్ టేబుల్ మీద దొంతరలు దొంతరలుగా పుస్తకాలు... ఇష్టంగా చదివే పుస్తకాలు... కాని

Read More

తారే జమీన్ పర్..! -వి. సునంద

మనసంతా ఆందోళనగా ఓ రకమైన భయంగా కూడా వుంది సుచరితకు. వస్తువు పోయినందుకు కాదు ఎవరు ఈ పని చేసింది, ఇంత ధైర్యంగా తీసింది. రోజూ తరగతి గదిలో వినిపించే జీవన విలువలు సూక్తుల ఫలితం ఇదా.. చదువుతో పాటు సంస్కారం కూడా నేర్పుతున్నా నా పిల్లలకు అనుకున్నా.. చదువే కాదు సాహిత్యంలో వాళ్ళ ప్రగతిని చూసి మురిసి పోయాను. కవితలతో వాళ్ళు వ్యక్తం చేస్తున్న భావాలు చదివి అందరు

Read More

పచ్చని అనుబంధం

“ఒరేయ్! చింటూ ఎందుకురా ! అన్నం తినకుండా అలా సతాయిస్తున్నావు” ఇటురా నేను తినిపిస్తా! అంటూ పిలిచింది శారదమ్మ. వాడంతే అత్తయ్యా! అన్నం తినే సరికి తాతలు దిగొస్తారు’ అంటున్న కోడలి మాటలకు నవ్వుతూ ‘ఇదిగో తాత దిగొస్తూనే వున్నాడు డాబా మెట్లు’ అంటూ వచ్చాడు పరంధామయ్య.. రారా మనవడా! మీ బామ్మ తినిపిస్తుంది. చింటూ చేయి పట్టుకొని శారదమ్మ దగ్గరికి తీసుకొచ్చాడు. వెనుక కోడలు సుమ అన్నం గిన్నెతో వచ్చింది. చెట్లకింద

Read More
error: Content is protected !!