|| మనసు రెక్కలగుఱ్ఱం ||
"మనసు రెక్కలగుఱ్ఱం"" వాన పాట ! చెడ్డీలాక్కుంటు కాగితప్పడవల్ని నీటిలోవదిలి గెంతులేసిన చిన్నప్పటి నన్ను పలకరిస్తుంది జేబులో రూపాయి ! ఆకాశంలో నక్షత్రాలకి నేలకు నిచ్చెనవేసే ప్రణాళిక రచిస్తుంది కన్నె వాసన! ఎడారి దారిలో ముళ్లపొదలకు పరిమళాల పూలు పూయిస్తుంది ఆశ! మనిషిని వానరాన్ని చేసి మహాసముద్రాలు దూకిస్తుంది మనసు రెక్కలగుఱ్ఱం పగ్గాలు వదిలితే విడదీయలేని చిక్కుముడుల్లో బంధిస్తుంది -నాగ్రాజ్ Pic Courtesy
Read More