Wednesday, July 6, 2022
Home > పుస్తక పరిచయం

సబ్బని ప్రేమ కావ్యం ” ప్రేమంటే “

ప్రేమ కావ్యాలకు కాలం చెల్లలేదా? శ్రీ కృష్ణ దేవరాయల పాలనా కాలాన్ని ప్రభందయుగముగా వర్ణి౦చారు. ఒక మనుచరిత్ర, , విజయవిలాసము వంటి ఎన్నో కావ్యాలూ వచ్చాయి. అలాంటి కోవలో ఆధునికంగా, భావావేశం తో ప్రేమంటే అనే స్వీటి రొమాంటిక్ కవితల్ని రాసారు, ప్రముఖ కవి శ్రీ సబని లక్ష్మినారాయణ గారు. ఈ పుస్తకం చదువుతుంటే మరొక సారి యవ్వనంలోకి తొంగి చూసినట్లు ఉంటుంది. కవితల్లో ప్రేయసి

Read More

!! నేనేమి మాట్లాడను… !! -పుష్యమీ సాగర్

!!నేనేమి మాట్లాడను...!! అక్షరాలకు మరణం లేదు. అవి చీకటి ని చీల్చే ఉదయాలు. కొత్త వ్యవస్థ కోసం కలలు కనే కన్న తల్లులే.. నేనేమి మాట్లాడాను, నా అక్షరాలే మాట్లాడతాయి. రచయత చేతి లో కలం స్పార్టకస్ కత్తి అవుతుంది. పాలకుల అవినీతి సామ్రాజ్యాలని చీల్చి చెండాడుతుంది. అవును నేనేమి మాట్లాడాను, నా కలం మాత్రమే మాట్లాడుతుంది అంటూ రేపటి భవిష్యత్ కోసం ఓ కవి చేతుల్లో అక్షరం కొత్త

Read More

నీవు పద్య కావ్యం -ఆధ్యాత్మిక తాత్విక ధార!

సాహితీరత్న డాక్టర్ గండ్ర లక్మనరావ్ గారు జగమెరిగిన కవి వతంషులు. తెలంగాణా జిల్లాలో వారి పెరు తెలువని వారు లేరు. తెలుగు సాహితీ క్షేత్రంలో గత నలబై ఏళ్ళ నుండి సాహిత్యంలో వివిధ ప్రకీయాల్లో డజన్కి పైగా రచనలుచేశారు. అంతేకాక విశ్వనాథ వేయిపడగలుపైన సిద్ధాంత పరిశోధన చేసి డిగ్రీ కళాశాల ఆచ్ఛాయులుగా పదవీవిరమణ పొందారు. పద్య వచన కవిత్వంలో, సాహితి వక్రుత్వంలో అందే వేశినా చేయి. తెలుగు సాహితీ క్షేత్రంలో

Read More

” సడి లేని అడుగులు ” విశ్వకవి రవీంద్రుని ‘గీతాంజలి’కీ ఆచార్య మసన చెన్నప్ప గారి సరళ సుందర అనువాదం. – సబ్బని లక్ష్మీనారాయణ

విశ్వకవి రవీంద్రునికి నోబెల్ బహుమతి తెచ్చిపెట్టిన 'గీతాంజలి' ని సరళ సుందరంగా తెలుగులోకి అనువదించారు ఆచార్య మసన చెన్నప్ప గారు. కవిత్వమంటే హృదయాల భాష , కవిత్వమంటే మార్మికత, తాత్వికత, దార్శనికత. అలాంటి లక్షణాలని పునికి పుచ్చుకొని ప్రకృతి సౌంధర్యాలను, రహస్యాలను ఇనుమడింప జేసుకున్న కవిత్వం అజరామమై వర్ధిల్లుతుంది. అలాంటిదే రవీంద్రుని కవిత్వం. రవీంద్రుని కవిత్వం ఒక నివేదన, ఒక అనుసంధానం భక్తునికి, భగవంతునికి. ఆ కవితాభావాలను అంతే

Read More

అనుభవ సత్యాలు మోపిదేవి రాధాకృష్ణ గారి “ కాంతి కెరటాలు” రెక్కలు… – సబ్బని లక్ష్మీనారాయణ

ఇటీవలి కాలములో కవితా జగత్తులో నానీలు, నానోలు, రెక్కలు అనే చిరు కవితలు బహుళ ప్రచారం పొందుతున్నాయి. నానీల సృష్టి కర్త డా. ఎన్. గోపి గారైతే, నానోల సృష్టి కర్త ఈగ హనుమాన్ గారైతే, రెక్కల సృష్టి కర్త సుగంబాబు గారు. వేటి లక్షణాలు వాటికున్నాయి మౌలికంగా. రెక్కల గురించి చెపుతే అవి అంతా ఆశామాషిగా రాసేవి కావు. కవితలకి రెక్కలస్తే అవి విహంగాల్లా ఎగురుతాయి సాహితీ లోకములో.

Read More

” చీకట్లో చిరు దివ్వెలు సబ్బని ‘తెలంగాణ నానోలు’ ” – ఈగ హనుమాన్

‘నానోలు’ ప్రస్తుతం తెలుగు కవిత్వంలో ఉన్న రూపాల్లోకి సూక్ష్మమైంది. నాలుగు పాదాలు, పాదానికి ఒకే ఒక్క పదం, ఆ పదం సరళమైన సమాసం లేదా సంధి అయినా సరే, ఇది ఈ ప్రక్రియ వ్యాకరణం. అలాంటి నానో ప్రక్రియను మనస్పూర్తిగా ఆహ్వానించి, తెలంగాణ కాంటెంట్‌తో ‘తెలంగాణ నానోలు’ పుస్తకం వెలువరించారు సబ్బని. ఇది 2010 లో మొదటి ముద్రణగా వచ్చి 2013లో ద్వితీయ ముద్రణగా వెలువడింది. తెలంగాణ, తెలంగాణ ఉద్యమాన్ని, ఊపిరిని ఈ

Read More

‘సినీవాలి’.. రంగుల ప్రపంచం లోని అన్ని రంగాల్ని చర్చించిన కమర్షియల్ నవల.

నిజాన్ని పచ్చిగా, నిక్కచ్చిగా చెప్పాలంటే ఎంతో గట్స్ కావాలి. అలాంటి రచనే ‘సినీవాలి’. డబ్బు, సెక్స్, ప్రేమ ప్రతి మనిషి కి అవసరమే.. కానీ ద్వేషం, పగ, ప్రతీకారం మనిషిని ఆవహిస్తే అది ఎదుటివాళ్లనే కాదు తనని కూడా దహించి వేస్తుంది. అంతరంగాల్లోకి తొంగి చూస్తే ప్రతి స్త్రీ గొప్పగా కనిపిస్తుంది. ‘తెల్లని వన్నీ పాలు కావు’ అన్నట్లు సినిమా జీవితం కూడా అంతే. కష్టాలు సామాన్య మానవుడికే కాదు అన్ని వర్గాల

Read More

అనుభవమే కవిత్వంగా వచ్చిన ఎస్.ఆర్ . పృథ్వీ దీర్ఘ కవిత ” నడక సడలిన వేళ ” – సబ్బని లక్ష్మీనారాయణ

ఎస్.ఆర్ . పృథ్వీ సాహిత్య ప్రేమికుడు, ఇంకా జీవిత నేపథ్యములో నడక ప్రేమికుడు. ఐదున్నర దశాబ్దాలు కాలినడకనే తన జీవితములో భాగము చేసుకున్నవాడు. అలాంటి వారు సడన్ గా ఒక తాగుబోతు సైకిల్ మోటారిస్టు వలన ఆక్సిడెంట్ కు గురై దాదాపు రెండు నెలలు బెడ్ రెస్ట్ అయినపుడు తన అనుభవాన్ని కవిత్వంగా మలిచారు పృథ్వీ గారు . కవిత్వం ఆర్ధ్రతతో కూడుకొని ఉంటుంది, అనుభవం లోంచి, అనుభూతిలోంచి పుడుతుంది

Read More

సబ్బని లక్ష్మీనారాయణ గారి “ తెలంగాణ రెక్కలు“ -నాగేంద్ర శర్మ

‘ఈ మట్టిపై మమకారం ఉన్న ప్రతి ఒక్కరికి ఆదరించే అమ్మ తెలంగాణ !’ అంటూ తెలంగాణ మట్టిపై మమకారం ఉన్న ప్రతి ఒక్కరికీ అంకితం చేస్తూ సబ్బని వెలువరించిన పుస్తకం ఇది. “ ‘ తెలంగాణ రెక్కలు ’ కృతిలో ఆరు పంక్తుల్లో తెలంగాణ స్వరూపాన్ని ఉత్తేజకరంగా ఉల్లేఖించారు” అని సబ్బనిని ప్రశంసించారు ప్రసిద్ధ కవి డా.సి. నారాయణ రెడ్డి గారు తన ముందు మాటలో. 'రెక్కల రూపశిల్పి' M.K. సుగంబాబు గారు సబ్బని “ తెలంగాణ రెక్కలు” నిలువెత్తు సత్యదర్పణం

Read More

“చెట్టునీడ” కవిత్వంలో సబ్బని భావవీచికలు – సంకేపల్లి నాగేంద్రశర్మ, కరీంనగర్.

సబ్బని లక్ష్మీనారాయణ కవితా సంపుటి "చెట్టునీడ" కవిత్వంలోవారి భావవీచికలు సామాన్య పాటకున్ని సయితం పులకింప జేస్తాయి. ఇందులో యాభయి కవితలున్నాయి. కవిత్వాన్ని నిర్మలంగా ప్రేమించే వారికి ఈ భావచిత్రాల విలువలు తెలుస్తాయి. పర్యావరణం మీద ఉన్న ప్రేమతో వారి కవిత్వం జాలువారి 'చెట్టునీడ 'గా నామకరణం అయింది. ఇందులో ప్రతి అక్షరంలో జీవం ఉట్టి పడుతుంది. కవిత్వం మీద, వ్యవస్త మీద, నిజాయితీ విలువలమీద, డబ్బు దాహం మీద, అశ్లీలం

Read More
error: Content is protected !!