Monday, February 17, 2020
Home > కవితలు > || చేతిలో పుస్తకం || -నాగరాజ్ వాసం

|| చేతిలో పుస్తకం || -నాగరాజ్ వాసం

(Image credits: Fine Art America)

అజ్ఞాన మబ్బులు కమ్ముకున్న
కన్నులు
పుస్తకం పై కదులుతున్న వేలికొసన
మసకగా కనిపిస్తున్న
అక్షరాలని వెంటాడుతున్నాయి

క్రమంగా అక్షరాల వెలుతురు
కళ్ళ లోకి ప్రవహించసాగింది

మత్తుమందు నరాల్లో చేరి
శరీరమంతా పాకి నట్లు
వెలుతురులో చేరి పుస్తకంలోని
అక్షరాలు కళ్ళగుండా
మెదడుని, అటునుండి
శరీరాన్ని పూర్థిగా ఆవహించి
వశపరుచుకున్నాయి…..

ఇప్పుడు నేను నేను కాదు…పుస్తకాన్ని…,
నాలో ప్రవహించేది….రక్తం కాదు,
అక్షరాలు…
నన్ను నడిపించేది,
నాలో స్పూర్తి నింపేది,
నాలో ప్రశ్నలను సమాధాన పరిచేది,
నన్ను ఆనందింప చేసేది,
నా మార్గాన్ని నిర్దేశించేది,
పుస్తకం…..పుస్తకం…..పుస్తకం…

ఒక్క మాటలో చెప్పాలంటే
నా పంచేంద్రియాలూ…. పుస్తకమే

-నాగరాజ్ వాసం

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!