Tuesday, July 14, 2020
Home > సీరియల్ > చుక్కాని చిరు దీపం (14 వ భాగం) -స్వాతీ శ్రీపాద

చుక్కాని చిరు దీపం (14 వ భాగం) -స్వాతీ శ్రీపాద

“చాలా కష్టపడ్డావుఅయితే, మా ఇద్దరి కధా కొంచం డిఫరెంట్. నా ఫ్రెండ్ చెల్లెలు చందన. పదేళ్ళపైన తేడా ఎవరికీ నచ్చలేదు. కాని నాకెందుకో గట్టి నమ్మకం, మా ఇద్దరికే రాసిపెట్టి ఉందని. ఆరేళ్ళపైన ఎదురు చూసాను. చందన తలిదండ్రులు ఇంట్లో అందరూ ఒప్పుకు౦టే తప్ప ఆమె ఎవరినీ మెచ్చటం పెళ్ళాడటం చెయ్యదట.
చివరికి ఒక సంబందం కుదిరి నిశ్చితార్దం జరుపుకుని తా౦బూలాలుకూడా తీసుకున్నారు. ..” అతన్ని మధ్యలోనే ఆపుతూ ,
“ఇద్దరూ కూడబలుక్కుని పెళ్లి చేసేసుకున్నారా?” అడిగాడు ఆత్రంగా.
“లేదు రిషీ. ఏదో గొడవ వచ్చి ఆ పెళ్లి ఆగిపోయింది. అప్పుడు నా మిత్రుడు మురళి తలిదండ్రుల ఇష్టం తోటే మా పెళ్లి జరిగింది. మాకు భగవంతుడి మీద చాలా నమ్మకం రిషీ ప్రేమ నిజమైనదయితే ఎవరూ అడ్డం పడరు చివరికి ఆ పై వాడు కూడా.”
“ట్రాష్, అదేమీ కాదంకుల్ … నిజానికి స్పందన అంటే పెద్ద ఇష్టమేమీ లేదు నాకు. డబ్బున్నా అనుభవి౦చ టం చేతకాదు ఒక్కరికీ. పైగా ప్రతివారిపై పెద్ద అనుమానం, వాళ్ళ డబ్బు చూసి ఎవరో ముంచేస్తారని. వల్ల నాన్నకు అసలు నమ్మకం కలగలేదు నామీద. అసలు ఎప్పుడో జరగా అలసిన పెళ్లి. నేను అమెరికా అచ్చి జాబ్ లో సెటిల్ అయ్యాక కాని కుదరలేదు.
ఇప్పుడు కూడా స్పందన ఎం ఎస్ చేసి తీరాలని కండిషన్.
అంకుల్ చిన్నప్పటి నుండీ నాకు కాబోయే భార్య గొప్ప ధనవంతురాలని నా జాతకం చూసిన ప్రతి వాళ్ళూ చెప్పారు. అందుకే నేనే ఒక వల చేసుకు ఉమ్చుకున్నాను. మీకు తెలుసా నేను పదో తరగతిలో ఉన్నప్పుడే ఆ అసమాన ధనరాసి కోసం వెతకడం మొదలు పెట్టాను. కనిపించే సరికే నా చదువు ముగింపుకు వచ్చింది.”
“ ఈ లోగా ఎవరితోనూ ప్రేమలో …” కాస్త కవ్వి౦పు ఉందా ప్రశ్నలో.
అప్పటికే మాటల్లో పడి చాలానే డ్రి౦క్ చేసాడు. కొత్త ఉత్సాహం కనిపించింది రిషి లో ఆ ప్రశ్న వినగానే.
“ అంకుల్ నాకిలా గొప్ప చదువులు చదివే వారంటే అసలు నచ్చదు. మాఇంట్లో మొదటి నుండీ ఆడవాళ్ళు బయటకు రాడం తక్కువే. నేనూ దానికి భిన్నం కాదు. కాని డబ్బున్న భార్య కావాలి. అమ్మకు ఇలా చేసుకోడం అస్సలు నచ్చని విషయం. తమ్ముడి కూతురిని తెచ్చుకుంటే చేదోడు వాదోడుగా ఉ౦టు౦దని ఆవిడ ఆశ. నిజానికి సావిత్రి అపురూపమైన అందగత్తే కాదు ముట్టుకుంటే మాసిపోయే రంగు పెద్ద వాళ్ళ ముందు తలకూడా ఎత్తని అణుకువ. మా మేనమామ కూతురు సావిత్రి. తానంటే నాకూ ఇష్టమే. ఇహ ఆ పిల్ల చిన్నప్పటి నుండీ నేనే తన భర్తనని గాఢ౦గా నమ్మి౦ది….”
అంతలో తెలివి తెచ్చుకున్నట్టు , “ఇహ ఇప్పుదాన్నే ఎందుకు అంకుల్ …” అంటూ మాట తప్పించి వేసాడు.
ఆ తరుఆత ఎందుకు అనుమానం కలిగించటం అని పొడిగించలేదు హరి.
డిన్నర్ ముగిసాక చాలా సేపు కూర్చుని అంత్యాక్షరి ఆడారు, పాత హిందీ పాటలు అద్భుతంగా పాడింది స్పందన. చిఅరికి గుడ్ నైట్ చెప్పుకుని నిద్రకు వెళ్ళే సరికి రాత్రి ఒంటి గంట దాటింది.
కళ్ళు మూతలు పడుతున్న చందనకు తమ సంభాషణ మొత్తం వినిపి౦చాడు హరి.
“ చెప్పలేదు కాని చందూ నాకు రె౦డు రెళ్ళు లెఖ్ఖేసుకు౦టే కధ కళ్ళకు కట్టినట్టుగా ఉంది. అతను ఈ పాటికే ఆ సావిత్రిని చేసుకునైనా ఉ౦డాలి. లేదూ ఈ పిల్లను వదిలించుకునైనా చేసుకు౦టాడు.
ఒకటి ఒక్కతే కూతురు కాబట్టి ఈ అమ్మాయిని నాచురల్ అనిపించేలా చంపనైనా చంపుతాడు ఆస్తి తనకు వచ్చేలా చూసుకుని లేదూ సతాయించి పిల్ల విడాకులు కోరేలా చేసి ఉద్యోగ౦ మాని ఆమె ఆస్థిలో సగం అడుగుతాడు. ఆపిల్ల ఏం చెయ్యాలో నాకు అర్ధం కాడం లేదు”
చందన నిద్రమత్తు ఒక్కసారి ఎగిరిపోయింది.
మనసులో ఏం ఆలోచన వచ్చిందో కాని ఒక్కసారి అతన్ని బలంగా కౌగిలించుకుని అతని ఎదలో తలదాచుకు౦ది.

********

మర్నాడు ఎంత ట్రై చేసినా టికెట్స్ దొరక్కపోడంతో మరో రోజు అక్కడే ఉండి పోవలసి వచ్చింది ఆ కొత్త జంటకు.
బ్రేక్ఫాస్ట్ తరువాత అయిబ్రోస్ షేప్ చేయి౦కు౦దామని ఒక రకంగా బలవంతాన స్పందనను తీసుకుని బయటకు వెళ్ళింది చందన. రిషి మూవీ చూస్తుంటే హరి కన్సల్టేషన్ లు ఫోన్ మీదే అటెండ్ అవుతున్నాడు.
పార్లర్ నడిపేది ఒక ఇండియన్ లేడీ. చందనకు బాగా తెలుసు. ఇద్దరూ వెళ్ళే ముందే ఆవిడకు ఫోన్ చేసి చెప్పింది చందన. అయిబ్రోస్ కోసం వచ్చినా ఇద్దరూ అక్కడ కాస్సేపు మాట్లాడుకోవాలని.
అందుకే బేస్ మెంట్ లో మిగతా కష్టమర్లను చూసుకుంటూ ఇద్దరినీ హాల్ లో కూర్చోమని చెప్పింది.
చందనకు ఎలా మొదలు పెట్టాలో తెలియక పోయినా ఎక్కడో ఒక చోట మొదలు పెట్టక తప్పదు గనక
“ సుమతి చాలా మంచి ఓపికగా చేస్తుంది. చాలా ఎక్స్పర్ట్ … అన్నట్టు ఎక్స్పర్ట్ అంటే … రాత్రి హరి చెప్పాడు” అంటూ అతని విశ్లేషణతో సహా మొత్తం చెప్పేసి, “ స్పందనా ఎంత ఆలోచి౦చినా నాకేమీ అర్ధం కాట్లేదు. ఎంత చదువుకున్నా , ఏ కాలమైనా ఆడవాళ్ళు ఇలా బలి అయిపోడమేనా అనిపిస్తో౦ది. ఎలా? ఏం చేస్తావు?
ఓపిక పట్టి మార్చుకోగలవా? అసలు ముందు వెళ్లి కాలేజిలో చేరనివ్వకపోతే ఏం చేస్తావు?”
“అంత వర్రీ అవకండి చందనా, ఇంత మోసం చేసిన వాడితో మరి కలసి ఉండే ప్రసక్తే లేదు. నిజమే మీరు అన్నట్టుగా వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు. నన్ను ఒక్కదాన్ని చేసి ఏం చేసినా నాకు ఇక్కడ పెద్దగా ఏమీ తెలియదు. పోనీ కంప్లెయి౦ట్ యాదానికీ మనకు ఏం ఆధారాలు ఉన్నాయి.
మీరన్నట్టు వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడే ఆ సావిరి గురించి ఆరా తీస్తే ఏదైనా సాక్షం దొరుకుతుందేమో
అమ్మ చెప్తూనే ఉంది , నాన్నకు అతని మీద అసలు సదభిప్రాయం లేదు. నేనే పొరబడ్డాను. అయినా నో రిగ్రెట్స్. పడినా లేచి మళ్ళీ నడుస్తాం నడక నేర్చుకునేప్పుడు. ఇదీ అంతే.
అలాగని అతన్ని వెంటనే నిలదియ్యను. నిలదీసి నేను గొడవ పెట్టుకోను. పెట్టుకుని ఇలా చాప కింద నీరులా ఉన్న వాళ్ళతో నెగ్గుకు రాలేము
నాకిహ ఇక్కడ చదవాలన్న ఆసక్తీ పోయింది.
అసలు అమ్మా నాన్నను వదిలి ఇక్కడికి రావడమే పొరబాటు. మించి పోలేదు.
వాట్ నెక్స్ట్ అనేది ఆలోచిస్తాను” నెమ్మదిగా ఏమాత్రం ఉద్వేగం లేకుండా చెప్పిందా అమ్మాయి.
“పోనీ మీ మమ్మీ డాడీ తో మాత్లాడతావా?”
బాగ్ లో నుండి ఫోన్ తీస్తూ అడిగింది చందన.
తటపటాయి౦పుగా చూసింది స్పందన.
“ పెద్ద తేడా ఏమీ పడదు స్పందనా , ఎంత సేపు మాట్లాడినా నెలకంతా ఒకటే బిల్ “ అంటూ ఫోన్ ఎలా డయల్ చెయ్యాలో చెప్పి , “ మాట్లాడుతూ ఉండు నేను కిందకు వ వెళ్లి చూస్తాను, తొందరేమీ లేదు. సావకాశంగా అన్నీ వివరంగా మాట్లాడు. ఒక గంటైనా నో ప్రాబ్లెం ఇబ్బంది లేదు.” అంటూ సెల్ఫోన్ ఆమెకి ఇచ్చి బేస్మెంట్ కి వెళ్ళింది చందన.
దాదాపు గంట తరువాత కిందకు దిగింది స్పందన. అప్పటికే సుమతి ఆమె కోసం ఎదురు చూస్తోంది.
ఇంటికి తిరిగి వచ్చేప్పుడు చెప్పింది స్పందన.
“డాడీ ఇవాళ టికెట్ కొనుక్కున్నారు ఫ్లైట్ ఎక్కుతున్నారు. మేం ఇంటికి వెళ్లేసరికి డాడీ వస్తారు. అమ్మకు బాగాలేదనీ నా అవసరం ఉందనీ ఏవో సంతకాలు కావాలని చెప్పి నన్ను తీసుకు వెళ్తారు. అక్కడ ఏమైనా ఆధారాలు దొరికాక ఏం చెయ్యాలన్నది ఆలోచిస్తాము.”
“గుడ్ “ ఎంతైనా ఈ కాలం పిల్లలు స్థితప్రజ్ఞులు అనుకుంది చందన.
ఇంటికి వెళ్ళాక కూడా చాలా మామూలుగానే ప్రవర్తి౦చి౦ది ఆ అమ్మాయి.
మర్నాడు వెళ్ళే ముందు రహస్యంగా చందనతో చెప్పింది.
“ఇండియా వెళ్ళాక ఫోన్ చేస్తాను” అని.
వాళ్ళను ఎయిర్ పోర్ట్ లో డ్రాప్ చేసాక స్తబ్దుగా ఉండిపోయిన చందనను పలకరిస్తూ ,
“ మరీ అంతలా ఫీలయితే ఎలా చందూ , ప్రపంచం అన్నాక అన్ని రకాల వాళ్ళూ ఉంటారు. చదువుకూ సంస్కారానికీ ఏమీ సంబందం ఉండదు. అయినా ఆ అమ్మాయి తెలివైనది అందుకే ముందుగానే అనుమానించి నీతో చెప్పింది.
లేకపోతే ఇక్కడ పూర్తిగా గృహ నిర్భందంలో ఎందరు బాధలు పడలేదు.”
“ నేను అదృష్ట వంతురాలను” గొణిగి౦ది చందన.
సరిగ్గా ఒక వారం సవ్యంగా గడిచి౦దేమో…
ఆ రోజు ఉదయం లేచి నిల్చు౦టూనే కళ్ళు గిర్రున తిరిగినట్టు అనిపించింది.
నిద్రమత్తు లోనేమో అనుకుంది. కాస్సేపటికి సర్దుకుంది. కాని సాయంత్రం లోగా ఒక ఐదారుసార్లు అలానే అనిపించాక
“ భగవంతుడా , ఈ సారేమి కానుకగా ఇవ్వబోతున్నావు?” భయం భయంగా అనుకుంది.
వరసగా నాలుగు రోజులు అలాగే ఉండే సరికి మల్లె డాక్టర్ చెకప్ , మళ్ళీ టెస్ట్ లు తప్పలేదు.
ఇంకా అవి జరుగుతూ ఉండగానే ఫోన్ చేసింది స్పందన.
ఆరా తీసి సావిత్రి ఇంటికి తెలిసిన వారిని ఎవరినో పెళ్లి సంబందం కోసం పంపారట డాడీ . నిజానికి వెయ్యి ప్రశ్నలు వేసి చివరికి “ మా పిల్లకు పెళ్ళయి పోయింది. అల్లుడు అమెరికాలో ఉన్నాడు” అంటూ చెప్పారు.
ఎలాగైతేనేం ఫోటోగ్రాఫర్ను, ప్రెస్ వాడిని పట్టుకుని ఫోటోలు పెళ్లి కార్డ్ సంపాదించాము.
అతనిపై చీటింగ్ కేస్ సిద్ధం అయింది. కనీసం ఏడేళ్ళు జైల్లో ఊచలు లేఖ్ఖపెట్టాలి.
ఆ అమ్మాయి మీద జాలి అనిపి౦చినా నొ ఒక మోసగాడిని వదల కూడదని అనుకున్నాను.
నా గురించి బెంగలేదు చందనా , ముందు డాడీ బిజినెస్ చూస్తాను ఎవరైనా నచ్చితే ఆలోచిస్తాను” ఆ అమ్మాయే ధైర్యం చెప్పింది చందనకు.
ఎం ఆర్ ఐ స్కానింగ్ అన్నీ జరిగాక బయటపడ్డ నిజం – మల్టిపుల్ స్క్లీరోసిస్
ఇద్దరూ మ్రాన్పడిపోయారు.

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!