Monday, February 17, 2020
Home > కవితలు > || బంగారాన్నే ప్రేమిస్తారు ఎందుకు? || -సబ్బని లక్ష్మీనారాయణ

|| బంగారాన్నే ప్రేమిస్తారు ఎందుకు? || -సబ్బని లక్ష్మీనారాయణ

బంగారాన్నే ప్రేమిస్తారు ఎందుకు?

కొందరు బంగారాన్నే ప్రేమిస్తారు
బంగారం లాంటి మనుషుల్ని వదిలేసి !
బంగారాన్ని తింటారా నిజంగా!
బంగారాన్ని ధరిస్తారా ఎల్లకాలం?
బంగారం శాశ్వతమా మనిషి జీవితంలో !
బంగారు కుర్చీలో కూర్చొని
బంగారు పెన్నుతో రాసేవాడు ఉండచ్చు
బంగారు పళ్ళెం పెట్టుకొని బంగారమైతే తినడుగా
బంగారు గ్లాసుతో నీళ్ళు త్రాగినా
బంగారాన్నైతే కరిగించుకొని త్రాగడుగా
పచ్చి మంచి నీళ్ళనే త్రాగుతాడు
బంగారు పెన్ను, బంగారు కుర్చి, బంగారు గ్లాస్ , బంగారు పళ్ళెం
మనిషికి అన్నీ ఇస్తాయా!
తొడుక్కోవడానికి బంగారు కవచాన్ని వాడుతాడా మనిషి !
ప్రకృతి నుండి, ప్రత్తి నుండి తయారు చెసిన
నూలు వస్త్రాలనే వాడుతాడు
ఆహారం బంగారం, బట్ట బంగారం
మనషి బంగారం, మనసు బంగారం కావాలి !
ఉట్టి మర మనిషి అవుతున్నాడు మనిషి !
తినే తిండి, త్రాగే నీరు, పీల్చే గాలి
తొడిగే బట్ట, ఉండే ఇల్లు
ప్రకృతి వర ప్రసాదాలు
ప్రకృతి వర ప్రసాదం ప్రతీది బంగారమే!
మరి మనిషి ఎప్పుడు గుర్తిస్తాడు ?

-సబ్బని లక్ష్మీనారాయణ

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!