Saturday, February 22, 2020
Home > కవితలు > || వెతుకుతున్నాను || -నాగరాజ్ వాసం

|| వెతుకుతున్నాను || -నాగరాజ్ వాసం

వెతుకుతున్నాను…..
నా ఆలోచనల్ని………

నిన్న ఉదయం ఏదో మెరుపు
నా ఆలోచనల్ని
ఎత్తుకెళ్ళింది

వెతుకుతున్నాను
ఆమెరుపుకోసం….
నా కళ్ళు నన్ను మోసం చేసిన మెరుపు
నన్ను నా ఆలొచనలను
నా నుండి ఎత్తుకెళ్ళిన మెరుపు

వెతుకున్నాను
వెతుకుతూనే ఉన్నాను……
మెరుపుతప్ప మరో ఆలోచన రానీయని
ఆ మెరుపు కోసం…

ఒక ఉదయం
మళ్ళీ మెరిసిందా మెరుపు…
ఇక వదల్లేను….
ఆమెరుపునే వెంబడించ సాగాను…
పరుగులు తీస్తున్నాను
అలసిపోతున్నాను
శక్తినంతా కూడ దీసుకుని
ఎలాగైనా ఆ మెరుపుని పట్టుకోవాలని
గుండె వేగం పెరుగుతుంది……
ఊపిరి అందడం లేదు…
శక్తి చాలడం లేదు….
కింద పడిపోయి లేవలేకున్నాను…..

అప్పుడాగింది ఆమెరుపు…..
నెమ్మదిగా నా దరిచేరింది
అలసి సొమ్మసిల్లిన నా మోముపైన
ఒక్క ఉదుటున … భయంగా వచ్చి చేరిన ఆమెరుపు…
స్వేదం జల్లులై రాలింది
నా అలసట దూది పింజల్లా ఎగిరిపోయింది…..

ఆ మెరుపు కళ్ళ లోకి సూటిగా చూసాను….
చప్పున అది నాలో కలిసి పోయింది

ఇప్పుడు నేను
నవచైతన్యం నిండిన
స్వయం ప్రేరేపిత
సూర్యుడిని…..
నాకు నేనుగా ప్రకాశించగల శక్తి గలవాడిని
నాలోని చైతన్యాన్ని కనుగొన్న జ్ఞానిని……

నేను నాలోనే ఉన్న తేజాన్ని..

-నాగరాజ్ వాసం

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!