Wednesday, June 3, 2020
Home > కవితలు > || చేదోడుll -కట్టా వేణు

|| చేదోడుll -కట్టా వేణు

ఒక్కసారీ తాకిచూడూ శిలకు కదలిక పుట్టదా
ఒక్కసారీ మీటిచూడూ మోడు వీణై మ్రోగదా

ఒక్కసారీ తడమవోయ్ ప్రతిగుండెలో తడి తగలదా
ఒక్కసారీ చదవవోయ్ ప్రతికంటిలో కథలుండవా

చిన్న చినుకే చాలదా చిరువిత్తనం మొలకెత్తగా
ఒక్కమాటే చాలదా ఒక జీవితం నిలబెట్టగా

జగతిలో ప్రతిమనిషిలో ఒక మహిమ ఏదో ఉండదా
మనసు వాకిలి తెరచి ఉంచితె మానవత్వం బ్రతకదా

నల్ల గొంగళిపురుగు మాటున రంగు జీవితముండదా
‘వేణు’ కవితను విన్నయంతనె వెలుగురెక్కల ఎగరదా

-కట్టా వేణు

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!