Monday, February 24, 2020
Home > కవితలు > || గుండె నిబ్బరం || -పివికే

|| గుండె నిబ్బరం || -పివికే

రెక్కాడినా డొక్కాడని బతుకులు
నిద్దుర తన్నుకుపోయిన అప్పులు
ధన దాసోహమైన బంధుత్వం.
స్నేహం మరచిన అంధత్వం
శ్రమంతా బూడిదనే
వెక్కిరింతల మధ్య
అలుముకున్న చీకట్లనే
అవకాశంగా మలిచి
నిజాయితినే ఆయుధంగా చేసి
ఉబికి వస్తున్న కన్నీళ్లను తుడిచిన
అలుపెరుగని శ్వాసకే తెలుసు..
గుండె నిబ్బరమెంతో..!

కనికరం చూపని కాళరాత్రిలో
చమటోడ్చిన సూరీడుకే తెలుసు
కాయ కష్టం విలువెంతో..!

-పివికే

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!