ఇంత చలిలో
వెచ్చని సెగ
నా చేతిలో ఉన్నది
నీ చేయి సఖి
చందమామ ఎర్రబారి
నిప్పులు కక్కు తున్నాడు
పడకగదిలో
విరహవేదనలో నువ్వు
మల్లెపూవు మత్తెక్కి
ఊగుతున్నాయి
నీ సిగలో చేరి
నీ మేని పరిమళానికి
మనగదిలో చీకటి
సిగ్గుతో తెల్లబారింది
మనిద్దరితో
రాతిరి గడిపింది కదా
-నాగరాజ్ వాసం
Facebook Comments