Saturday, May 30, 2020
Home > కవితలు > || విశ్వ వీణ || -ఓర్సు రాజ్ మానస

|| విశ్వ వీణ || -ఓర్సు రాజ్ మానస

నా తల్లి తెలంగాణ
నా పల్లె తెలంగాణమా!

ప్రకృతిజిలుగులపసిడివన్నెలదాన
పరికినిలోపల్లవించినదాన
ఒయ్యారాలుఒలికించే సిన్నదాన
సౌభాగ్యపథంలోపయనించినదాన
“తెలంగాణ”

తెలంగాన రారాజు నా బాస

సక్కదనలసవ్వడులసరిగమలు
ఆరాటపోరాటాలప్రతిఫలం
స్వరాష్ట్రసాధనాల సౌరాష్ట్రం
నాతెలంగాణావిశ్వవీణాలజాణ
“తెలంగాణ”

అవరోధాలు,అవమానాలుతట్టుకొని
తెలంగాణభాషసకలజనులమాత
సారస్వతప్రియులహృదయగోషలు
చరిత్రసంస్కృతులసంగమక్షేత్రం
నాతెలంగాణనవనీతలవీణా
“తెలంగాణ”

నా తెలంగాణాలోన
దోపిడీ,దౌర్జన్యాలఅంతుజూసి
నైజామోడీపైజమానుడదీసినారో
గల్లీగల్లీలల్లో లొల్లిజేసి
ఉద్యమకీర్తిని చాటిoడ్రో
నాతెలంగాణ బిడ్డల్లారా!
“తెలంగాణ”

గస్తీనిషన్లు,స్వేచ్చావిరులుతరిమి
భావస్వాతంత్రమేభవ్యమన్నరు
ఆంధ్రమహాసభలు,గ్రంథాలయాలు
చైతన్యదీపికలైవెలిగాయినేడు
నాతెలంగాణపురివిప్పిననేలరా
“తెలంగాణ”

నా తెలంగాణను జూసినోళ్ళు
తౌరాక్యాoధ్రులనిహేళనజేసినోళ్లను
గోల్కొండకవులసంచికగొంత్తెత్తినిల్చింది
కాళోజి,దాశరథి,వట్టికోట,జయశంకరులు
కలంగళంలగంభిరతలువిదిలించిన
నాతెలంగాణకవులగన్న కనకధార
“తెలంగాణ”

నాతెలంగాణను జూడు
జానుతెలుగులసరసాలుఒలుకు
ఆదికవిపాల్కురిఅందలమెక్కినాడునేడు
ప్రపంచగమనాన్నే మార్చే
తెలుగుమహాసభలపుణ్యపేటి
నాతెలంగాణకళాకారులకాణాచి
“తెలంగాణ”

నా తెలంగాణాలో పారు
మంజీరనడకలహోయలసిరులు
సారస్వతాల వర్తమానం
భవిష్యదర్శనాలఉజ్వలఫలము
విశ్వవీణలమోగించును చూడు
నా తెలంగాణలోనా
ప్రపంచవేదికపైకాంతులుజల్లునుసూడు
నా తెలంగాణాలోన ఓ..ఓ..ఓ
“తెలంగాణ”

చిరునామా : ఓర్సు రాజ్ మానస
వృత్తి :పరిశోధక విద్యార్ధి.ఓయూ
ఊరు :ధర్మపురి
జిల్లా:జగిత్యాల
సెల్:9849446027

Facebook Comments

3 thoughts on “|| విశ్వ వీణ || -ఓర్సు రాజ్ మానస

  1. చాల మంచి కార్యక్రమం.తెలంగాణ సాహిత్యం అపూర్వమైన ఖనిజ సంపదలకు నిలయం.భాష,సంస్కృతులను వెలికితియ్యవలసిన అవసరం ఉన్నది.

Leave a Reply to Rajashekar.Pachimatla Cancel reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!