Saturday, May 30, 2020
Home > కవితలు > || “ఆఖరి ప్రేమలేఖపై” “చివరి సంతకం” || -రాజు ఎం

|| “ఆఖరి ప్రేమలేఖపై” “చివరి సంతకం” || -రాజు ఎం

“ఆఖరి ప్రేమలేఖపై”
“చివరి సంతకం”

“ఓ… హృదయమా”…!!

“ఓ…పడమటి సంధ్యారాగాన్నై నేను”…!!
“ఓ…తూరుపు రవి కిరణమై నీవు…!!

“తిరిగిచూడని తూరుపుకై”
“ఎదురుచూసే పడమటినై”…!!

“కలవని పిలవని పలకని నీ…కోసం”
“విడువని గెలవని మానని ప్రయత్నమై”..!!

“అతకని ఆశల రెక్కలతో”
“రాలిన చుక్కల వాలిన దిక్కులలా”
“కలవాలనున్నా………..కలవని”..!!

“———–“మనమో”———”
“తూరుపు——పడమరలం”..!!

“చిన్న చిలకరింపు చినుకు తడికై పలకరింపులేని”
“మోడువారిన బతుకునై బీడువారిన ఎదగదిలో”
“ఎడారంటి దేహంతో ఎదురుచూపుల దాహంతో”
“చివరి పిలుపుకై నిరీక్షిస్తూ…………………నేను”..!!

“వర్షించే వరమివ్వని”
“కురవని కనికరమివ్వని”
“నిండు మేఘమాలికలా”..!!

“మనసున్నా—మనసివ్వని”
“వర్షించని——కరుణించని”
“రాతి–హృదయం–నువ్వు”..!!

“నీకై ఎన్ని ఇంద్రధనస్సుల”
“వంతెనలు అల్లుకున్నానో”
“అటునుంచి ఇటు–ఇటునుంచి అటు”
“తురుపు—పడమరల మధ్య”..!!

“ఒక్కసారైనా”…..
“దాటి వస్తావని–చూసిపోతావని”…!!

“ఎన్ని ప్రార్థనల–ప్రేమలేఖలు”
“రాసుకున్నానో………..”దేవి”..!!
“నీ…పాదాలచెంత—–పరిచి”
“అక్షరాల లక్షల పూలతో అభిషేకించడానికి”…!!

“ఎన్ని విన్నపాల వేడుకోలు కవితలు”
“రాసాకున్నానో”..!!

“నినుచేరి”…

“ఒక్కటైనా కరిగించదా…”నిను”
“ఒక్కసారైనా కరుణించవా..నను”
—————-“అని”——————-

“నువ్వు నడిచే దారిలో”…
“ఓ………పూలవనమై”
“ప్రతీ పూవులో నా ప్రాణాన్ని”
“దాచిపోతున్నా”…

“ఓ…గడ్డిపూవునై ఎదురుచూస్తున్నా”…!!

“నీ పాదమైనా సోకదా”
“నా తనువుని కలితోనైనా తన్నదా అని”…!!

“చివరగా”…!!

“ప్రాణంలేని నా హృదయపు శిలపై”
“మోటుబోయిన ఆశల——ఉలితో”
“చివరి అక్షరం చెక్కుతున్నా”…!!

“ఆకరి పేజీలో నా ముగింపు ప్రేమకథ రాస్తున్నా”…!!

“నువ్వద్దన్న నా ప్రాణం ఇక్కడే వదిలేస్తున్నా”…!!

“రెండు కన్నీటి బొట్లైనా నాకొరకై రాల్చిపో”!!..
“పిడికెడు మట్టైనా నాదేహంపై వేసిపో”..!!

..రాజు(100వ కవిత)
949298199

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!