Wednesday, July 18, 2018
Home > కవితలు > || చివరి మజిలీ || -నాగరాజ్ వాసం

|| చివరి మజిలీ || -నాగరాజ్ వాసం

అమ్మ ఆనందంలో
ప్రసవవేదన
ఏడుస్తు శిశువు
జననం

పలకా బలపం
మోయలేని పసితనం
బండెడు పుస్తకాల
మోత

కళాశాల కారాగారంలో
బంది
అజ్ఞాన సాగరంలో
రాంకుల వేట

చదువొకటి
జీవితమొకటి
చదువుకి సంభంధం లేని
ఉద్యోగం

కెరీర్ ,పెళ్లి
ఆశలు, ఆప్యాయతలు
రెంటికీ చెడిన పరుగు

డబ్బుకోసం
పదవికోసం
సౌఖ్యం కోసం
నా కోసం
నా వాళ్ళ కోసం
పరుగు పరుగు
పరుగు పరుగు

గమ్యం మరణం
మనం దేనికొసం
పరుగు తీసామో
దాన్ని వదిలి
ఏది వెంట తీసుకు పోలేని
మహాప్రస్థానం

జీవుని చివరి మజిలి
మరణం

ఏడుస్తూ జన్మించి
ఏడిపించి వెళ్ళే
మనిషి సాధించిన
ఎకైక విజయం

-నాగరాజ్ వాసం

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!