Sunday, October 2, 2022
Home > కవితలు > || తెలంగాణ మొగ్గలం || -ఓర్సు రాజ్ మానస

|| తెలంగాణ మొగ్గలం || -ఓర్సు రాజ్ మానస

బుడి బుడి నడకల సవ్వడులం
గల గల పారే గమనులం
సరిగమలు పాడే సరసులం
పాల బుగ్గల పసివాళ్ళం

“మొగ్గలం”

బాలలం మేం బాలలం
భరత మాత బిడ్డలం
పిల్లలం మేం పిడుగులం
భావి భారత మొగ్గలం

“మొగ్గలం”

తెలంగాణ గువ్వలం
తెగువ చూపే రవ్వలం
పల్లె పల్లె దివ్వెలం
జాతినిజాగృతపరిచేమొవ్వలం

“మొగ్గలం”

చరితులం మేం చరిత్రులం
గత గాథల గమనులం
వర్తమానాల అవధులం
భవిష్యతరాల భగీరథులం

“మొగ్గలం”

వెల్లువిరిసిన సంస్కృతి
వన్నెతరగని వారసులo
ప్రేమను పంచే పాలపిట్టలము
మమతలద్దె మధురిమలం

“మొగ్గలం”

కలలు గనే కాంతులం
తెలంగాణ జయకేతులం
తెలంగాణ మొగ్గలం
శాంతి రూపు సాగరులం

“మొగ్గలం”

మేమే మేమే తెలంగానం
కళామతల్లి ముద్దుబిడ్డలం
సమర శంఖం పూరిస్తాము
మనుసునిండాగీతికలైపాడుతాం

“మొగ్గలo”

 

చిరునామా : ఓర్సు రాజ్ మానస/రాయలింగు
పరిశోధక విద్యార్ధి.ఓయూ.
హైద్రాబాద్.

ధర్మపురి,జాగిత్యాల.జిల్లా
సెల్ :9849446027

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!