Monday, February 17, 2020
Home > కవితలు > || ఎస్… ఐమ్ ఇన్ లవ్ ||

|| ఎస్… ఐమ్ ఇన్ లవ్ ||

ప్రేమ కోసం ప్రాణాలైనా ఇచ్చెయొచ్చు అంటే నమ్మలేదు.. నవ్వొచ్చింది..
కానీ నిన్ను ప్రేమించాకే తెలిసింది.. అది నిజమేనని..

ఎస్… ఐమ్ ఇన్ లవ్..

ఓ ప్రేమ నా ప్రేమ..
నా ఊహల కలవై రావమ్మ..
నువ్వే నా ఊపిరి చిరునామా..
నా ప్రాణం నువ్వే ఓ ప్రేమా.. నా ప్రేమ..

నిను బుజ్జి అంటూ పిలవనా..
మహముద్దుగ నిను లాలించనా..

నిను బంగారం అని పిలవనా..
భద్రంగా మదిలో దాచనా…

నిన్ను కన్నా అంటూ పిలవనా..
కమనీయంగా వాటేయనా..

నిన్ను చిన్ను అంటూ పిలవనా..
చిరు కానుకలే అందించనా..

ఏడడుగులు నీతో నడవగా..
ఈ లోకాన్నే ఎదిరించనా?

కలకాలం నీతోడుండగా..
కాలాన్నే నే ఆపేయనా?

మహరాణిగా నిను నే చూడగా..
ఈ మహిలో పూజలు చేయనా?

ప్రతి క్షణమూ నిను ప్రేమించగా..
ఈ ప్రాణాన్నే వరమీయనా?

నేనేం చేసినా.. ఎలా చెప్పినా..
నీకోసమమ్మా నువ్వే నా ప్రాణం ప్రేమా..
నువ్వే నా ప్రాణం ప్రేమ..

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!