Tuesday, September 25, 2018
Home > కవితలు > || మహా పురుషుడు || -దాసరి వీరారెడ్డి

|| మహా పురుషుడు || -దాసరి వీరారెడ్డి

సమస్త వృక్షాలలో పుష్పాలను వికసింపచేసే ప్రకృతి
నీ దేహంలో ఆత్మ పుష్పాన్ని వికసింప చేయదా?
సమస్త లోకాన్ని ప్రకాశింపచేసే సూర్యుడు
జ్ఞానోదయం తో నీ బుద్ధిని ప్రకాశింప చేయడా?
సమస్త ధరణి కి వర్షాన్ని పంపే మేఘుడు
నీ హృదయం లో పవిత్రతను వర్షింపచేయడా?
సమస్త ఆకాశంలో నక్షత్రాలను ఉదయింప చేసిన దైవం
నీ మనసులో మహోన్నత ఆలోచనలు ఉదయింప చేయదా?
చీకట్లో వెన్నెల చిత్రాన్ని అందంగా గీసిన విశ్వం
నీ బాధలలో సంతోషాన్ని విచిత్రంగా పంచలేదా?
ఇంద్రధనుస్సును వంచిన ప్రకృతి
నీ విధి కర్మ ల తల వంచలేదా?
విత్తు లో వృక్షాన్ని దాచిన ప్రకృతి
నీ హృదయంలో మహాపురుషున్ని దాచింది
మంచితనాన్ని మించినదేదో ఆకృతి
రక్షణ కై నీ ఆత్మ లో తల దాచింది
ప్రకృతికి విశ్వం ప్రసాదించిన వసంతం
కాదా మనసును జయిస్తే ప్రతిక్షణం నీ సొంతం
తనతో తానే పోరాడి కాదా గొంగళి భ్రమరం
రాదా సర్వం నీతో నువ్వు గెలిస్తే సమరం..

-దాసరి వీరారెడ్డి

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!