Monday, May 21, 2018
Home > కవితలు > || రైతు గతి ఇంతే || – రామా

|| రైతు గతి ఇంతే || – రామా

పిల్లలు పెద్దయ్యాక
మీరేమౌతారు అనడీగితే
వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులు
చిన్నప్పటినుండి నూరిపోసినట్లుగానే ..
ఒకరు నేను డాక్టరు నౌతానని , మరొకరు యాక్టరునౌతానని , మరొకరు ఇంజనీరు నౌతానని, మరేదో ఒకటీ …
లాంటివే చెబుతారు కాని …
దేశానికి వెన్నుముక లాంటి
రైతునౌతానని ఎవరు అనరు …
అలా ఏ తల్లిదండ్రి నేర్పించరు .
అది ఆ పిల్లల తప్పుకాదు ..
అలాగని తల్లిదండ్రుల తప్పుకూడా కాదు
మన దేశంలో చస్తే కూడా
రైతుగా పుట్టకూడదు
రైతు గా పుట్టటం
ముమ్మాటికి అతని తప్పే
మన దేశంలో మరి ..
అతను తినడానికి కూడా
పండించుకోలెనంతగా
మారిన ఇప్పటి పరిస్థితులను
పట్టించుకోలేని నాయకులు పుట్టడం
మన దేశ దౌర్భాగ్యం అని ..
ఎవరిని అని ఏం లాభం లేదు .
మెతుకు మెతుకును ఏరుకుని తినే
పరిస్థితికి వెళ్ళాక చూస్తే
మన దేశంలో రైతు అనేవాడు
ఇలా ఉండే వాడటా
అని పాఠ్య పుస్తకాల్లో ,
మ్యూజియంలలో చూసుకోవడానికి
కొన్ని ఆనవాల్లు మాత్రం
మిగిలి ఉంటాయ్ ..
పురావస్తు శాఖవారికి
అప్పుడప్పుడు భూమిలో నుండి
రైతు కరిగించిన చెమట చుక్కల్లో తడిసిన
కొన్ని వింత వస్థువులఅవశేషాల
ఆనవాల్లు దొరుకుతుంటాయి ..
మన దేశంలో రైతు గతి ఇంతే …

-మీ.రామా ఎలిమెగండ్లా

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!