ఇయ్యాల ఎన్నీల
ఇరగ కాసింది
పున్నమి నాడే కదా
మన ప్రేమ విరిసింది
మనం ప్రేమ గువ్వలమై
మై మరచి కౌగిల్ల లో
నలిగి పోతుంటే
సెందురిడి ఎన్నీల
విరగబడి మనకు
మద్దతు తెలుపుతుంటే
చివురించిన మన
ప్రేమ పరిమళం
జగమంతా పేరుకుంటే
ఎన్నిల రాజే
రంగుమారి పోయాడు
పాలనురగల ఎన్నీల రంగు
ఎరుపెక్కి
ప్రేమ మైకంలో
జోగుతుంది
ఇయ్యాల ఎన్నీల
ఎరుపెక్కి ఇరగకాసింది
-నాగరాజ్ వాసం
Facebook Comments
హితేన సహితం సాహిత్యం