నాలో కవిత పురిటి నొప్పులతోతండ్లాడుతుంటే
నాలో అక్షర జ్వాలలు పురుడోసుకున్నవి
మొగ్గలుకవిత వికాస ప్రభలు
నాలో రక్తాక్షరాలు రూపుదిద్దుకున్నప్పుడల్లా
మొగ్గలు స్వేతవర్ణమై మెరిసింది
మొగ్గలు ఉదయించే ప్రభాతాలు
నాలో మొగ్గలు అంకురార్పణ చేసినాక
నా అక్షర సేద్యంమరింత బలపడింది
మొగ్గలు వికసించే ప్రభాత కిరణాలు
మొగ్గలు పుష్పించి పరిమళాలద్దిందో లేదో
కవన వనంలో వసంతమై నిల్చింది
మొగ్గలు మల్లెపూవుల సోయగం
మొగ్గలు కవిత జవంలో వెలిగిందోలేదో
కవన సేద్యం సింగిడై రంగులద్దింది
మొగ్గలు కవితాక్షరాల త్రిపదం
-ఓర్సు రాజ్ మానస
Facebook Comments