నా అంతర్ముఖం
నా కలమే నా బలం
పదాలే నా ప్రాణాలు
ఊహలే ఊపిరులు
ఆలోచనలే ఆలంబనలు
అనుభవాలే అక్షరాలు
పరిస్థితులే ప్రశ్నలు
సమాజమే తెల్లని కాగితం
జీవితమే నల్లని సిరా
జీవితం అనే పొలంలో
ఆశల నాట్లు వేసి
ఎండిన గుండెను
కన్నీటితో తడిపి
కాలం అనే కడగండ్లు కురిసి
చెదిరిపోయే ఆశల పంటలా
మారకూడదు నా జీవితం..
అందుకే
చెడును మంచితో
కొపాన్ని శాంతంతో
అబద్ధాన్ని నిజంతో
మనసును అగ్నితో
కళ్ళను ఆర్తితో
ఆత్మను బుద్దితో
శుద్ది చేసుకొని ప్రయాణం సాగిస్తాను..
నన్ను నేను కోల్పోకుండా నా ఉనికి కాపాడుకుంటాను..
జ్ణాపకాల రహదారిలో నేనో బాటసారిని..
అనంత దూరంలో ఆనందపు అన్వేషిణిని..
ఇది నాకై నేను ఏర్పరుచుకున్న లోకం..
నన్ను నేను ఆవిష్కరించుకునే ప్రయత్నం..
దానికోసమే ప్రతి క్షణం నాలో అంతర్మదనం..
ఇదే నా అంతర్ముఖం..!!
~అఖి~
Facebook Comments