Tuesday, September 25, 2018
Home > కవితలు > || అద్దం లో మనం || -నాగరాజ్ వాసం

|| అద్దం లో మనం || -నాగరాజ్ వాసం

కాంక్రీటు అడవిలో
బ్రతుకుతున్న యంత్రాలం మనం

సెకను ముల్లుతో సాగిపోయే
బ్రమరాలం మనం

విద్యను మార్కులతో
కొలిచే బుద్ధి జీవులం మనం

ప్రేమకు కొలమానాలు
వెతికే తూకపు రాల్లం మనం

స్వార్థమే సరియని
నిస్వార్థంగా నమ్మే ఏకాకిగా
బ్రతికే అనేకులం మనం

మానవత్వం అర్థాన్ని
గూగుల్లో వెతికే మానవులం
మనం

సంఘంలో బ్రతుకుతున్న
ఒంటరులం మనం

మనిషితనానికి దూరమౌతున్న
అమానుషులం మనం

-నాగరాజ్ వాసం

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!