Wednesday, December 19, 2018
Home > కవితలు > ||అర్హత మొగ్గలు|| -ఓర్సు రాజ్ మానస

||అర్హత మొగ్గలు|| -ఓర్సు రాజ్ మానస

ఆలోచించే అంతస్సాత్వమున్నది
ఆచరించే ఆత్మ స్థైర్యముంది
ఆలోచనే కదా ఆత్మ సుగంధం

గాయపరచని మనసుంది
గౌరవించే సంస్కరముంది
మనుసే కదా సంస్కారాల నిలయం

మలినం లేని మమతానురాగముంది
మౌనంగా ఉండలేని మానవత్వమున్నది
మమతానుబంధాలకూడలి మానవత

అవధుల్లేని హృదయోల్లాసముంది
అలవోకగాకదంతొక్కే అంతరంగముంది
హృదయోల్లాసమే అంతరంగ గమనం

గుండెల్లో అగ్నిపర్వతాలు బద్దలౌతున్నా
ముఖానచిరునవ్వు పూసుకుతిరిగే జీవకలుంది
జీవకళే కదా ముఖారవిందం

పాశ్చాత్యసంస్కృతి నీలినీడలోపయనిస్తూ
కుసంస్కారులౌతున్న నా వాళ్ళనుద్ధరించడానికి
మొగ్గలై వికసించిపరిమాళాలద్దుతాను

గత వైభవపు వేదాకాలపు వెలుగులు విరాజిమ్మటానికి
నిస్వార్థదేశభక్తి రగుల్గొల్పడానికి
దేశభక్తే శరణాగతార్హతౌతుంది

-ఓర్సు రాజ్ మానస

Facebook Comments

One thought on “||అర్హత మొగ్గలు|| -ఓర్సు రాజ్ మానస

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!