Sunday, January 17, 2021
Home > కవితలు > || నీ కంటే విలువైనది ఏదీ లేదు || -చిన్ను

|| నీ కంటే విలువైనది ఏదీ లేదు || -చిన్ను

|| నీ కంటే విలువైనది ఏదీ లేదు ||

నీ కంటే విలువైనది ఏదీ లేదు నాకు ఈ లోకంలో బంగారం..

నీ తేనే పలుకు వింటే చాలు పులకించిపోతోంది నా హృదయం..

నీ సుతిమెత్తని స్పర్శ తగిలిన చాలు నా ఈ తనువు పొందేను పరవశం..

నీ స్వేదం నా తనువు పై కురిసిన చాలు ఈ దేహాన విరజిల్లేను పరిమళం..

నీ సుమధుర నామం నా గొంతు లో ఓ అమృత ప్రణవనాదం..

నీ తీయని స్వరం నా గుండె లో సుస్వరాల పంచమవేదం..

నీ ప్రేమ అనంతమైతే.. అది నాకే సొంతం..

నీ ప్రేమ అపారమైతే.. అదే నాకు అద్భుతం..

నీ ప్రేమ మహత్యం.. కాదా నాకు మహిమాన్వితం..

నీ ప్రేమ శాశ్వతం.. నాకదే తీయని మకరందం..

నీ ప్రేమ నాకు జీవం.. నీ పేరే గా నిరంతరం నా ధ్యానం..

నీవే గా నా ప్రాణధనం.. నీ ప్రేమే కదా నాకు ఇంధనం..

నీ కొరకు చేయనా రణం.. మన పెళ్ళికి కట్టించనా మామిడాకు తోరణం..

నీకై చేయనా ఓ ప్రేమ యాగం.. నీ తోడే ప్రియా నాకు రాజభోగం..

మీ చిన్ను…

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!