Monday, February 24, 2020
Home > కవితలు > ||భాగ్యం అనే నేను|| -చల్లగాలి శ్రీనివాస్

||భాగ్యం అనే నేను|| -చల్లగాలి శ్రీనివాస్

కాసుల వేటలో….
మా తనువుల కొలువులు
బంధం కాని….
ఆ మణి బంధానికి బలియై
ధరి చేరని నావలా….
దహనమై సాగుతు
దారమౌతున్న రూపాయికి …కరిగిపోతు
రూపానికి… వెలిగిపోతు
రొగానికి…ఎదురుపోతు
కడుపుకోతకి…తరిగిపోతు
రోజు…రగిలిపోతు
వొల్లంత…నలిగిపోతు
మోహదాహనికి…సేదతీర్చుతు…..
ఒక్కరు ఇద్దరు ఎందరో….నిత్యం
తెరముందు అన్ని బాగ్యాలే…..
ఆ వెనకే
దౌర్భాగ్య నరకాలు
సోకుల సరుకుతొ…సరసాలు
పై సౌందర్యానికి… బెరాలు
నడిసంద్రంలొ…నరకాలు
తీరం చేరని… నయనాలు
మరనిస్తు జనిస్తున్న…జీవితాలు
మి వీధి చివర నేను!
సూర్యుడి అస్తమనం మొదలు
అంగడి బొమ్మనై….
సూర్యోదయం వరకు
అంత రంగుల మయమే…..
ఈ చీకటి వ్యాపారం లో!

-చల్లగాలి శ్రీనివాస్
రాజనగర్ జగిత్యాల జిల్లా

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!