Monday, February 24, 2020
Home > కవితలు > || సన్నజాజి || -కవిశేఖర

|| సన్నజాజి || -కవిశేఖర

రైతు నానీలు

1.
మబ్బులు లేని
ఆకాశంజూసి రైతు
నిట్టూర్చి నిలవలేక
నేలగూలిండు

2.
చేయడ్డువెట్టి
మొగులు జూసే రైతు
చేను తడువలే
మేను తడిసింది

3.
ఆరుగాలపు శ్రమ
నంగడికొంటవోతే
దళారులే
తళారులైరి

4..
ఆయిటి బూనిందని
ఆశ పడ్డ రైతు
ఇంట్లున్న ఇత్తులు
మంట్లె వోసిండు

5.
మబ్బుపొదుగు సుధకై
మన్నెదురు చూస్తుంది
రైతు స్వేదం
అంకురించాలని

– కవిశేఖర

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!