రసరమ్య భావాల రమణీయ గీతాల రాజిల్లుభాష తెలుగు
నవనీత మాధుర్య నాజూకు లావణ్య నవ్యముగ నడిచింది తెలుగు
తేనె చినుకుల వలె తేట పలుకుల వలె తియ్యదనం పంచింది తెలుగు
ఓంకారమున జనియించి విశ్వమంతా వ్యాపించి వీనుల విందది తెలుగు
మమకారమును సంధించి మమతలే పూయించి మరులు గొల్పుతున్నది తెలుగు
పోతన్న కైతలో పాల్కురికి కవనంలో పాలవెల్లై మెరిసింది తెలుగు
ఎంకిపాటల యేరులా జానపద జాతరల ఒగ్గుకథల మధువులొలికది తెలుగు
అందనిద్రాక్షయై అందరికీ దూరమై ఆపసోపాలు పడుతుంది తెలుగు
మహాసభలపేరిట మహోత్సవములు గావిస్తు మదిని పులకింపజేస్తుంది తెలుగు
తెలుగుతల్లి తోటలో సంస్కృతి సుమాలు వికసించి జగతి సిగలో జాబిలై మురిసింది తెలుగు
-అనుశ్రీ
Facebook Comments