Monday, January 18, 2021
Home > కవితలు > || గల్ఫ్ జిందగీలో || చల్లగాలి శ్రీనివాస్

|| గల్ఫ్ జిందగీలో || చల్లగాలి శ్రీనివాస్

బతుకంత బాటసారులైతే…
యవ్వనమంతా ఎడారిపాలే

ఏల్లకు ఏల్లు కరిగి పోతుంటే …
లైటార్పిన నిద్దుర రాక

జంటకోరికలో ఒంటరి వేదన
తట్టిలేపగ తరలి పాయే
రంగుల రాట్నం……

కలల హలలో
ఒంటరి సవాసం

లొలోన తెలియని స్పర్శలో
చీకటి హత్తుకు పోతుంటే….

మనసు వశమై
వయసు ద్రవమై
కలత కరిగి

ఊపిరి ఆగినట్టు…
ఉప్పెన ఉరిమినట్టు
సునామీలా చుట్టేస్తుంటే

చీకటి చెదిరిపోతు
నిద్ర జారిపోతు
మత్తు మత్తుగా
మేలుకువస్తూ…

శ్వాసలో
ష్………..
కరిగి పోతన్న కాలం
ఆరిపోతున్న తడి

వలస బతుకుల్లో ….
ఉలిక్కిపడి కనులు తెలిస్తే….
తడి…….

కలచెదిరే…
సిగ్గు తడిచే…..
మంచు కురిసే…

మాటరాని మౌనరాగం
పక్కోని గురక గదంత ద్వనిస్తున్నా…
మధి నిశ్శబ్దం….

ఆ…నిరీక్షణలో మనసు మేల్కొని
అడుగులేశా…
అటువైపూ….
ఇంకెన్నాల్లో….

చల్లగాలి శ్రీనివాస్(రాజనగర్)
గల్ఫ్ జోర్డాన్
+962786142360

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!