Saturday, February 22, 2020
Home > కవితలు > || శూన్యాంతరంగం || -వెన్నెల సత్యం

|| శూన్యాంతరంగం || -వెన్నెల సత్యం

ఇరవై నాలుగ్గంటలూ
ఎదుటివారి
అంతరంగంలోకి
తొంగి చూడటమేనా?

నా అంతరాత్మ
నన్ను నిలదీసింది
నిజమే కదా అని
నా అంతరాంతరాల్లోకి
వెళ్లి వెతికాను..!

మనుషుల హృదయాల్లో
నేనెప్పుడూ వెతికే
నీతీ నిజాయితీ
నిబద్దత
సహృదయత
స్వచ్ఛత
చిత్తశుద్ధి
మంచితనం
మానవీయతల్లాంటివి
మచ్చకైనా
కనపడలే లోపల!

కాస్తంత సిగ్గేసింది..
అయినా
మనలో లేనివాటినేగా
మందిలో ఉండాలని
మనం కోరుకుంటాం!

కాదంటారా??
నాకయితే
నిజమే అనిపిస్తోంది మరి!

-వెన్నెల సత్యం

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!