Monday, February 17, 2020
Home > కవితలు > || నా గుండె బద్దలౌతుంది || -చిన్ను

|| నా గుండె బద్దలౌతుంది || -చిన్ను

ఈ వార్త చదువుతుంటేనే నా గుండె బద్దలౌతుంది..
ఓ నవ భారతమా నువ్విక మునిగిపోవడం ఖాయం..
ఈ కళి గమనం లో నీ జీవితకాలం గడువు ముగిసింది..
నేటి ధుశ్శాసన పాలనలో ధుర్మదాంధులకు పెంపుడు తల్లులు నా ప్రభుత్వాలు..
అడుగడుగునా నేడు అత్యాచారాలతో నా దేశం ప్రజ్వరిల్లుతోంది..

ఇంటింటా శ్రీ రామ చంద్రలు పోయి..
కామ చంద్రుల వృద్ధి జరుగుతోంది..
మానవ సంబంధాలు మంటగలిసిపోయి..
మగాళ్లను మృగాలుగా తిలకించాల్సొస్తోంది..
మానభంగ పర్వం లో నా చిట్టితల్లుల హృదయాలు ఘోషిస్తున్నవి..
ఎంతమంది నిర్భయ లు..
ఎంతమంది ఆసీఫాలు..
మరెంతమంది గీతా లు..
ఇంకెందరు, మరెందరు మహలక్షులు అసువులు బాసిల్లాలి..
మన అమ్మ కూడా సాటి ఆడదే అని వీళ్లకెప్పుడు తెలియాలి..
వీళ్లని శిక్షించకుండా ఏళ్ల తరబడి దున్నపోతుల్లా మేపుతున్న ప్రభుత్వాలనేమనాలి..

ఈ దేశంలో పుట్టినందుకు మొదటి సారిగా సిగ్గు పడుతున్నా..
ఈ మృగాలను కన్నందుకు ఎన్ని కడుపులు తరుక్కుపోతున్నవో..
ఎన్ని హృదయాలు కన్నీటి సంద్రాలై ఉప్పొంగుతున్నవో..
ఎన్నెన్ని నయనాలు రక్తాశృవులు చిందిస్తున్నవో..
ఇంత అత్యున్నత ఘనత సాధించాక ఇంకా బ్రతకాల్సిన అవసరం లేదేమో..
ప్రళయమా ఎక్కడున్నా ఒక్కసారి వచ్చిపో..
మమ్మల్ని నీలో కలిపేసుకో..
యుగాంతమా నువ్వైనా ఒక్కసారి విజృంభించి రా..
ఈ పాపభారాన్ని కడిగేసి వెళ్లు..
నీ చాకచక్యం తో నా ఈ దేశాన్ని, ఈ సమస్థాన్ని కడిగినముత్యం చేయు..
లేని దేవుడు ఉన్నాడన్న భ్రమ తో పాటు,
మనిషి అనేవాడు కూడా ఉన్నాడన్న భ్రమలోనే బ్రతికేద్దాం రేపటి నుండి..
చెప్పడానికి ఏమీలేదు..
మాట్లాడానికి అస్సలు లేదు..
నా నయనాలు చిందించు అశ్రువులే సాక్ష్యాలు..

-మీ చిన్ను

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!