Saturday, May 30, 2020
Home > కవితలు > || కవులు – కావాలసినవాళ్ళు || -అశోక చాకలి

|| కవులు – కావాలసినవాళ్ళు || -అశోక చాకలి

కవులు
కాలంతో పయానం జేయాలే
ప్రజల కన్నీలు గుర్తించాలే
ఆ కన్నీలకు సాక్షిగా ఉండాలే

కవులు
ప్రజానీక0తో దోస్తాన జేయాలే
అగో , గాల బాధలను
పపంచకానికి పరిచయం జేయాలే

కవులు
సమాజం లో తిరగాలే
సర్కారుకు కనిపియని
ప్రజానికం కష్టాలను,
భరిస్తున్న బాధలను
అగో, గాల కన్నీలను
సర్కారుకు కనపడేలా
రాతలు రాయాలే

కవులు
ప్రజానికానికి అండగా ఉండాలే
జనమoధరి గొంతును
గాల తరుపున ఇన్పీయ్యాలే
మంచికోసం పోరాటం జేయాలే
అన్యాయానికి అడ్డుగా నిలువాలె
చేతలతోనో , రాతలతోనో

ఎవల
మనసుల ఎటువంటి ఇది లేకుండా
మాకోసం , మంచి సమాజం కోసం
ప్రజానికాన్ని ,
ప్రభుత్వాన్నీ ,
ప్రపంచకాన్నీ
నిద్రలేపే
రాతలను రాస్తారో
రాస్తున్నారో
అగో గాళ్ళు
మాకు నిజమైన
కవులు, కావలసిన వాళ్ళు .

మీ
అశోక చాకలి
9542713076

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!