Tuesday, July 16, 2019
Home > కవితలు > || ‘అమ్మ’ మణి పూసలు || -వెన్నెల సత్యం

|| ‘అమ్మ’ మణి పూసలు || -వెన్నెల సత్యం

అపురూపం మనకు అమ్మ
రానీయకు కంటి చెమ్మ
ఆమె కంట ఆనందమె
నీ బతుకుకు అర్థమమ్మ!

తన ఒడిలో పెంచె నిన్ను
తన ప్రేమే వెన్ను దన్ను
నీ విజయపు అంచులకై
చూపుతుంది నీకు మిన్ను!

అద్దంలో చందమామ
ఆకలిలో తల్లి ప్రేమ
చూపి నట్టి అమ్మ నిపుడు
మనము ఆదరించ లేమ!

అమ్మ ఇచ్చినట్టి పాలు
అయ్యె నేడు నేల పాలు
ఆమె పలకరింపు లేక
నేడు ఆశ్రమాల పాలు!

అమ్మ కప్పి నట్టి కొంగు
ఆకాశం దాని రంగు
ఆ క్షణము తల్చు కుంటె
ఆనందమున ఎద పొంగు!

-వెన్నెల సత్యం.
9440032210

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!