Wednesday, January 29, 2020
Home > కవితలు > || మాట విలువ || -రాజశేఖర్ పచ్చిమట్ల

|| మాట విలువ || -రాజశేఖర్ పచ్చిమట్ల

|| మాట విలువ ||

మాట వలన పెరుగు మమతలు బంధాలు
మాట వలన మనకు చేటు గలుగు
మనషు లాచి తూచి మాటాడ వలయును
పచ్చిమట్లమాట పసిడిమూట

మాట మనిషి లోని మాలిన్య మునుతుంచు
మాట మనుషు లందు మమత బెంచు
మాట వలనె మనకు మర్యాధ ప్రాప్తించు
పచ్చిమట్లమాట పసిడిమూట

మాట మధుర మైన మంచి మిత్రుల నిచ్చు
మాట కఠిన మైన మనసు విరుచు
మాట శక్తి దెలిసి మసలుకున్నమేలు
పచ్చిమట్లమాట పసిడిమూట

మాటవలన మనిషి మాన్యుడయివెలుగు
మనిషి విలువ పెరుగు మాట వలన
మనిషి నుదుటి రాత మార్చేది మాటలే
పచ్చిమట్లమాట తసిడిమూట

-రాజశేఖర్ పచ్చిమట్ల

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!