ఆడంబరాల గదిలో ఆదమరచి
నిద్రిస్తూ అందమైన కల రాలేదని
ఆవేదన పడే విపరీత ధోరణి నీది
ప్రశాంతంగా పదినిముషాలు
కాలాన్ని మరిచి విశ్రమించాలనే
ఆలోచన నాది…
తప్పులని వేలెత్తి చూపుతూ
ఎదుటి మనిషిని తక్కువ చేస్తూ
పదునైన మాటల్ని విసిరి
చురుకైన తత్వమనుకునే
తృప్తి నీది….
కష్టాన్ని చూసి కరిగిపోవడం
సందర్భానికి స్పందించడమే
అసలైన నైజమనే భావన నాది..
అతుకుపడని విరుద్ద తత్వాలమైనా
అరమరికలతో అలజడులు తలేత్తినా
కలిసిసాగాలనే యోచన నాది
నా ఆలోచన మీదే తిష్టవేసి
రంగులు మార్చుతున్న స్నేహం నీది..
అయినా సరే మార్పులేమైనా చేరి
హృదయాంతరాలలో ఏనాటికైనా
నిన్ను నీవు చూసుకుని తెలుసుకోవాలని
వేచి చూస్తూ నడుస్తున్నా ఇన్నాళ్ళుగా…!
అనూశ్రీ….
గోదావరిఖని
Facebook Comments