Tuesday, July 16, 2019
Home > కవితలు > || పల్లె || -ఆకుల రాఘవ.

|| పల్లె || -ఆకుల రాఘవ.

|| పల్లె ||

పల్లె మెలుకుంటే
ప్రగతి వెల్లి విరియు!
ప్రగతి వెల్లి విరిస్తే
కండ పుష్టి ఈ దేశం!
పల్లె కొక్క చెరువు
జలం జీవ చలనం!
ఇంటి కొక్క చెట్టు
పచ్చదనం పెంచు!
మోట బావిచేదబావి
కలిగి ఉంటే జలం పొంగు!
సాగుబడి కూలి పని
కలిసి సాగుతుంటే
సిరిలు దొర్లి ఇండ్లు నిండు!
కుల వృత్తులు చేతి వృత్తులు
పురుడు పోసుకుంటుంటే
పల్లె కళలకాంతులు చిందు!
చినుకు ఒడ్సి పడితే
పుడమి తాగి ఊట చిమ్ము!
సాగునీరు తాగునీరు
స్మృద్దిగా నిల్వ వుండు!
కరువు పటా పంచ లై
పల్లె అన్న పూర్ణగా వెలుగు!
పశువులు గొర్లు మేకలు
మందలుగా పల్లె నుంటే
కోళ్ళు పక్షులు పల్లెల్లో
గుంపులుగా తిరిగి ఆడితే
పాడి పొంగే పల్లె పసిడి!
కాలుష్యం పాతి పెట్టి
పల్లె పరిశుభ్రమైతే
ఆరోగ్యం మహా భా గ్యం
పల్లె నిండా వెలుగొందు!
తర తరాల మనుగడకు
పల్లె మార్గ దర్షిగా నిలుచు!
పల్లె వాసులంతా కలిసి
ఐక్యంగా జతకట్టి
పల్లె పురోభివృద్ధి
ప్రణాళికలు వేసుకుంటే
పాలన తల వంచదా?
కలిసి పల్లె తొనడవదా!?

-ఆకుల రాఘవ.

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!