దయచేసి
నను
క్షమించవే
తల్లి
నేను రాసిన కవిత్వం
నా భుజాలపై
శాలువై వాలింది గాని
నీ కడుపున అన్నమై వాలి
ఆకలి తీర్చలేకపోయింది
సిగ్గుతో చచ్చిపోతున్నాను అమ్మ
నీ ఆకలి తీర్చని అక్షరం
నను ఉద్దరించే అతిథిదని
నలుగురికి చెప్పుకోలేక
అందుకే నా భుజాలపై వాలే
శాలువాలను
నడి రోడ్డుపై నిద్రను కౌగిలించుకున్న
బ్రతుకుల భుజాలపై కప్పుతాను అమ్మ
ప్రస్తుతానికి ఇంతకుమించి
ఏమి చేయలేని అల్పుడిని
అందుకు
నను క్షమించు తల్లి
క్షమించు సమాజమా .
*అభిరామ్* 9704153642
Facebook Comments