Monday, August 19, 2019
Home > కవితలు > || తప్పూ || -అశోక చాకలి

|| తప్పూ || -అశోక చాకలి

జీవితం లో
తప్పులు తరుచుగా
జరుగుతున్నాయి
అది తప్పుఅని తెలిసి కూడా ..!

ఎంత మంది చెప్పినా
ఎన్నిసార్లు చెప్పినా
కొన్నివేళ్ళసార్లు
నాలో నేనె కుమిలి పోయినా ..!

మనస్సులోతుల్లో
మచ్చలా మిగిలిన జ్ఞాపకాలతో
కుస్తీపడినా ..!

బంధాలు దూరమైన
కన్నీళ్లు కాలువల పొంగ్గే వరదలా
ముంచేసినా …!

కనికరం లేని ఈ నా సమాజంలో
ఏకాకీల మారినా ..!

తప్పును తప్పకుండా చేస్తున్నానే గాని
ఆ తప్పు జరగకుండా ఆపటం అంత సులువుకాదేమో అనిపిస్తుంది
బహుశా
ఇదో ప్రశ్నల మిగులుతుందేమో మరి ..!

సమాధానం కొసం వెతికితే
ఇక ప్రాణం లేని శరీరమే
మిగులుతుందేమో మరి ….!

ఒక తప్పువల్ల జీవితం ఇంతలా మారుతున్నప్పుడు
ఆ తప్పు చేయకపోవడమే మంచిదేమో మరి ..!

ఆలోచిస్తే
అన్ని వింతలా మిగిలిపోతాయేమో మరి ..!

-అశోక చాకలి
9542713076

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!