రైతు కెవరు చెప్ప లేదు
నాగలి కట్టి దుక్కి దున్ని
పంటలెన్నో పండించి
ప్రజల కందించ మని!
మట్టి తోనే మనుగడని
తెలుసుకున్న రైతన్న
ప్రకృతిలో గింజలు
సేకరించి సాగుచేసి
చెమటతోనే చెళ్ళ పెంచి
పుట్ల రాశులెన్నో పోసి
తన బతుకును దిద్దు కొని
ప్రజల కొరకు పాటు పడే!
పుడమి అన్న ప్రాణ మిచ్చి
ప్రతి నిత్యం మట్టిని
కళ్ళ కద్దు కొంటునే
అనుబంధం పెంచు కొని
పగలు రేయి ఎండ వాన
అన్నదే మరిచి పోయి
పంటలకే రైతన్న
విధాతగా నిలిచే!
ఎండి మునిగె పంట లైన
కాలం పై భారమేసి
తిరిగి సాగు చేస్తూనే
పుట్ల రాశులేన్నో పోసు
అమ్మ బోతే అడవి అయిన
కొనబోతే కొరివి అయిన
చెమటే గా పోయింది
అనుకొనే కృషీవలుడు!
రైతు విత్త నాలెప్పుడో
శాస్త్ర వేతల చేతుల్లో పడి
సంకర వంకర వంగడాలై
రైతుల కొనిపించే స్థితికి
ఎదిగి పోయి వ్యాపారం
లక్షల్లో జరుగు తుండే!
కల్తీ విత్తనాల కోరల్లో
రైతులు చిక్కి శల్యమయ్యే!
భూమిని నమ్మిన రైతుల
పంటలకు బ్రహ్మ రైతును
సాగు అంటేనే చచ్చెలాగ
పరిస్థితులు కలిపించి
వలస పక్షులుగా చేసే!
భూములన్నీ నేడు
పెద్ద గద్దల పాలయ్యే!
ఫాంహౌస్ లేన్నో వెలసే!
ఓటు బ్యాంక్ ప్రభుత్వాలు
సబ్సిడీల తైలం పూస్తు
పరిహరపు నూకలు పెడుతూ
బిక్ష గాళ్ళుగా రైతుల మార్చే
నాటి నుండి నేటి వరకు
ఏ పాలనైన ఒక్కటే
రైతుల కొరిగింది ఏమి లేదు
రైతుల బతుకు మట్టినే!
జైహింద్.
ఆకుల.రాఘవ.