Wednesday, October 16, 2019
Home > కవితలు > || ఎందుకంటే || -నాగ్రాజ్

|| ఎందుకంటే || -నాగ్రాజ్

అతనికేం తెలుసు
వెన్నెల రేడి చల్లందనాలు
నీ కన్నుల కురిపిస్తావని
నీచేతి స్పర్శ లో మంచుపూలు
పూయిస్తావని
మాటలో మంచిగంధాలు
చిలికిస్తావని

ఎవరో అతను
నన్నడిగాడు
ఆవిడంటె ఎందుకంత ప్రేమని ?

నిత్యం చెరగని చిరుదరహాస
జ్యోతులవెలగించే నీ
మోము చూపించా !

నిశ్చేష్టుడై
ప్రశ్న‍ాజవాబుల్లేని
అతని కన్నుల్లో ప్రేమ పూల
వికాసం.

అందుకే నిన్నెవరికి
చూపించకుండా
నా కన్నుల్లో బందించా.

-నాగ్రాజ్

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!