మనసు రెక్కలు!
•••••••••••••••••
మండు వేసవిలో
బొండు మల్లెలు
నీ జడలోనే
పూస్తాయెందుకో!
నన్నల్లుకునే
పూల తీగవి కదూ!!
*****************
నిన్నటి దాకా
నీ జ్ఞాపకాలే
నా మనసుకు
రెక్కలయ్యాయి!
ఇవాళ చిత్రంగా
రెక్కల్లో నీ జ్ఞాపకాలు!
-వెన్నెల సత్యం
షాద్నగర్
940032210
Facebook Comments