Friday, November 22, 2019
Home > కవితలు > || నాన్నా నికేమివ్వను? || – అశోక చాకలి

|| నాన్నా నికేమివ్వను? || – అశోక చాకలి

( పెళ్లి తరువాత పెళ్లికూతురు పడే భాద
ఆ బాధనుంచి వచ్చే కన్నీరు )

నాన్నా నికేమివ్వను
నాకైతే అడగనివి కూడా ఇచ్చేసావ్

నాకు ఓమంచి జీవితనిచ్చావ్
నువ్వెంతో కష్టపడి
నాకు ఓనమాలు దిధించావ్
పెంచి పెద్ద చేసావ్

నేచేసే ప్రతి పనిలో ,
క్లిష్టమైన పరీక్షల సమయాలలో
నా వెంటే నాకు తోడుగా ఉన్నావ్
ఎంత కష్టానైనా ఎదురించే ధైర్యాన్ని ఇచ్చావ్

నాకు ఒంట్లో బాగుండకపోతే
నువెంతో బాధపడ్డావ్
నాజీవితం బాగుండాలని
నీ జీవితాన్ని త్యాగం చేసావ్

నే బాగుండాలని
నన్ను ఓ అయ్యచేతిలో పెట్టావ్
ఇంతలా నాకోసం కష్టపడ్డ నీకు నేను ఏమివ్వగలను

నిన్ను విడిచి వెళ్లాల్సి వచ్చిందన్న
బాధతో కారే నా కన్నీరును తప్పా……

-అశోక చాకలి

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!