Tuesday, July 14, 2020
Home > కవితలు > || చెమటగంధం ||

|| చెమటగంధం ||

ఎన్నాళ్ళుగానో ఒక కోరిక
అందమైన ప్రణయగీతం రాయాలి
కలం పట్టుకుని కాల్పనిక
విధుల్లో తిరగడం మొదలుపెట్టాను
నేను ఊహించిన లోకం కాదిది
ఎక్కడున్నానో తెలియడంలేదు
అంతా బురద,ముళ్లపొదలు
బొట్లు బొట్లుగా కారుతున్నరక్తపుచుక్కలు
అధిరిపడి వెనుతిరిగాను
ఆగమంటూ ఎవరో వెంబడిస్తున్నారు
ఏదోభయం నాలో
పాదాలు వేగంపుంజుకున్నాయి
ఒక్కసారిగా అక్షరాలు
కుండపోతగా నాముందు
వర్షమై ప్రవహిస్తున్నాయి
చెమట వాసన
కన్నీటిధార
ఆర్తి పిలుపు
ఇదంతా నేను రోజు
చూసే ప్రపంచమే
ఈ రోజు కొత్తగా
చెమటగంధం పూసింది
అక్షరాల చేయిపట్టుకున్న
మట్టిమనుషుల గీతం రాస్తున్న
అభూతకల్పనల చెరనుండి బయటపడి!

నాగ్రాజ్….

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!