Friday, August 7, 2020
Home > కవితలు > || మనసు రెక్కలగుఱ్ఱం ||

|| మనసు రెక్కలగుఱ్ఱం ||

“మనసు రెక్కలగుఱ్ఱం””

వాన పాట !
చెడ్డీలాక్కుంటు కాగితప్పడవల్ని
నీటిలోవదిలి గెంతులేసిన
చిన్నప్పటి నన్ను పలకరిస్తుంది

జేబులో రూపాయి !
ఆకాశంలో నక్షత్రాలకి
నేలకు నిచ్చెనవేసే ప్రణాళిక
రచిస్తుంది

కన్నె వాసన!
ఎడారి దారిలో
ముళ్లపొదలకు
పరిమళాల పూలు పూయిస్తుంది

ఆశ!
మనిషిని వానరాన్ని చేసి
మహాసముద్రాలు
దూకిస్తుంది

మనసు రెక్కలగుఱ్ఱం
పగ్గాలు వదిలితే
విడదీయలేని
చిక్కుముడుల్లో బంధిస్తుంది

-నాగ్రాజ్

Pic Courtesy

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!