Saturday, February 22, 2020
Home > పుస్తక పరిచయం > ” సినిమా ఒక ఆల్కెమీ “

” సినిమా ఒక ఆల్కెమీ “

మూడు వారాల క్రితం వరకు వెంకట్ శిద్దారెడ్డి గారు అంటే నా వరకు ఒక పేరు తెలియని సినిమాకు ఒక డైరెక్టర్, నవతరంగం అనే వెబ్సైటు లో సినిమా రివ్యూలు రాస్తాడు అని మాత్రమే తెలుసు. కానీ ఒక్కసారి ” సినిమా ఒక ఆల్కెమీ ” బుక్ చదివిన తరువాత , వెంకట్ శిద్దారెడ్డి గారు అంటే ఏంటో తెలిసింది.
మే 13 వ తారీఖున టాక్ ఎట్ సినీవారంలో మొదటి సారి సర్ ని కలిసాను. ఇక్కడ మా సినీవారం కి కృతజ్ఞతలు చెప్పుకోవాలి, సినీవారం రూప కర్త ” మామిడి హరికృష్ణ ” అన్న కి, సినీవారం టీం నరేందర్ అన్న, అక్షర అన్న,సంఘీర్ అన్న,వినయ్ అన్న, సతీష్ అన్న అందరికి చాలా థాంక్స్ . ఇలాంటి ఒక వేదిక ని మాకు అందించినందుకు..

ఇక వెంకట్ శిద్దారెడ్డి గారు సినీవారం లో మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ఆ రోజు మీరు అన్న ఆ ఒక్క మాట చాలా బలంగా తగిలింది సర్ . ” అసలు చదవడమే రాదు, ఇంక రాయడం ఎలా వస్తుంది” అనే మాట . అలాగే సినిమా గ్రామర్ అంటే సృష్టం గా తెలిసింది ఆ రోజే..
మీ సినిమా కేసు no 666 , మిమ్మల్ని కలవక ముందు ఈ సినిమా చూసి ఉంటే, ఆ సినిమాపైన నా అభిప్రాయం వేరేలా ఉండేదేమో!  ఫౌండ్ ఫుట్ ఏజ్ గురించి అప్పటికి కొంత అవగాహన ఉన్న, మిమ్మల్ని కలిసాక సినిమా చూసాక ఫౌండ్ ఫుట్ ఏజ్ సినిమా ఇలానే ఉంటది అని తెలిసింది.
ఇక మీరు ” సినిమా ఒక ఆల్కెమీ ” బుక్ రిలీజ్ చేస్తున్నారు అని తెలిసినపుడు ఎంతో ఆనందం వేసింది, బుక్ కొని చదివాకా ఇంకా ఎంత అంటే మాటల్లో చెప్పలేను .. ఒక టికెట్ మీద వంద సినిమాలు అన్నట్లు .. మీరు ఒక్క 220 రూపాయల బుక్ టికెట్ మీద ౩౦ సినిమాలు చూపించారు, సినిమా ఎలా చూడాలో కూడా నేర్పించారు.. ౩౦ మంది గొప్ప దర్శకుల పరిచయం, అందులో మహా అంటే నాకు తెలిసిన పేర్లు నాలుగైదు. ఇక ప్రతి సినిమా కి మీరు ఇచ్చిన వన్ లైనర్స్ సూపర్బ్.. మీరు సినిమాని వర్ణించిన విధానం ❤❤.. ఇంకా బుక్ లో నాకు బాగా నచ్చినది .. కవర్ పేజీ , కవర్ పేజీ చూడగానే బుక్ చదివేయాలి అనిపించింది.

” గొప్ప కథలు గొప్ప పుస్తకాలు అవుతాయేమో కానీ గొప్ప సినిమా కావడానికి గొప్ప కథ అవసరం లేదు . సినిమా అంటే కథ మాత్రమే కాదు, ఎన్నో కళలు కలిపినా ఉత్తమ కళ ” టోక్యో స్టోరీ గురించి చెపుతూ మీరు రాసిన మాట. అలాగే మీరు అందించిన ఇంకో మాట ” A good life is elimination of unnecessary ” ఇలాంటివి ఎన్నో ఈ పుస్తకం లో నాకు చాలా బాగా నచ్చాయి. ఇలాంటి ఒక పుస్తకాన్ని మా అందరికి అందించినందుకు ధన్యవాదములు, కృతజ్ఞతలు గురువు గారు …
నాదొక చిన్న మనవి సర్.. వీలైతే ” సినిమా ఒక ఆల్కెమీ – 2 ” కూడా మాకు అందిస్తారు అని ఆశిస్తూ…

-శివ కట్టా

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!