బతుకు బంగరు తల్లిరా తెలంగాణ
భవ్యమైన సీమారా తెలంగాణ
వీరుల కన్నతల్లి – విప్లవాల గడ్డ
సాయుధ పోరాటం – సాగించినా గడ్డ
రత్నాల సీమ ఇది – రాజకీయపు గడ్డ
నట్ట నడిమి సీమ – నా తెలంగాణ
పురుటి పోరు గడ్డ- పుణ్యాల దేవిరా
ముక్కొటి తెలంగాణ – ముచ్చటైన సీమ
కష్టజీవుల గడ్డరా తెలంగాణ
కమనీయ కావ్యమ్మురా తెలంగాణ
శాతవాహన గీత – కాకతీయుల రీతి
విజయనగర కీర్తి- తెలంగాణ తల్లి
గోదారి కృష్ణమ్మ – కుడి ఎడమల తీర
విలసిల్లిన సీమ – తెలంగాణ సీమ
నిమ్మల ఆదిలాబాద్ – ఇందూరు భారతి
నిజాం కైనారం – వరంగల్లు కోట
మెతుకు సీమల జాడ – పాలమూరు జిల్ల
ఖమ్మం మెట్టు సీమ- నల్లగొండను జూడు
రంగారెడ్డి జిల్ల – పట్నం హైదరాబాద్
లష్కర్ సికింద్రాబాద్ – భాగ్యనగర సీమ
జానపదుల బాణిరా తెలంగాణ
జానుతెనుగు సీమారా తెలంగాణ
ధూళికట్ట క్షేత్ర – బౌద్ధ చైత్యాలు
కొలనుపాక సీమ – జైన దేవాలయం
యాదగిరి నరసన్న – కొమరెల్లి మల్లన్న
సమ్మక సారక్క – బాసర సరస్వతి
ధర్మపురి నరసన్న – కాళేశ్వరం శివుడు
భద్రాద్రి రామన్న – ఎములాడ రాజన్న
మంత్రపురి నగరం – మంథనీ క్షేత్రం
పుణ్య గోదావరి – గౌతమేశ్వరాలయం
సిద్ధుల గుట్టలు- మెదక్ చర్చీలు
మసీదు, దర్గాలు – సిఖ్ గురుద్వారాలు
బతుకమ్మ పండుగలు- దసర జిమ్మీచెట్టు
బోనాల జాతర్లు- బద్ది పోచమ్మలు
తెలంగాణా తల్లిరా తెలంగాణ
తెలంగాణా సీమారా తెలంగాణ
భువనగిరి బురుజులు – పానగల్ కోవెలలు
గొల్లకొండ కోట – చార్మినార్ జూడు
రామప్ప శిల్పం- నాగినీ నృత్యం
కాకతీ శిల్పం – ఏకశిల నగరం
రమణీయ కుంతాల – నిర్మల్ బొమ్మలు
పెంబర్తి డిజైన్లు – ఫిలిగ్రీ కళలు
గద్వాల చీరెలు- పట్టు పోచంపల్లి
సిరిసిల్ల చేనేత – సిరిగల్ల ఈ సీమ
కళల కాణాచిదిరా తెలంగాణ
కమనీయ సీమ ఇదిరా తెలంగాణ
ఇందూరు భారతీ- మానేరు సాహితీ
మంజీర సాహితీ – మూసి సాహితి వరద
పొన్నెగంటి తెలుగన్న – పాల్కురికి సోమన్న
బమ్మెర పోతన్న – భక్త రామదాసు
అచ్చతెనుగు కవులు- అభ్యుదయ కవిత
కథల పుట్టినిల్లు- కావ్యాల పుట్టిల్లు
గ్రామీణ చిత్రాలు- డోలు బుర్ర కథలు
యక్షగాన కృతులు – జానపద బాణీలు
సురవరం కథనాలు- దాశరథి కవితలు
కాళోజి గొడవలు – సినారె కావ్యాలు
ఉద్యమ కవితకు – ఊపిరైన నేల
సజీవ కావ్యాలు- సత్యమైన కథలు
కళలు సాహిత్యమ్మురా తెలంగాణ
కమనీయ కావ్యాలురా తెలంగాణ
మంజీర నదులిచట – మానేరు, మున్నేర్లు
ఒక పక్క గోదారి- మరు పక్క కృష్ణమ్మ
శ్రీరాంసాగర్లు – మ్రోయతుమ్మెద పరుగు
మూసి నదుల బాట – మురిసిపోయిన చోట
సింగరేణి గడ్డ – సిరులు కురిసేనేల
బోధన్ షుగర్లు – సర్ సిల్క్ కంపిన్లు
ఆజంజాహి మిల్ – అంతర్గాం మిల్
ఆల్విన్ కంపిన్లు కంపిన్లు- ఎఫ్ సి ఐ కంపిన్లు
ఎన్టిపిసి లుండె- కెటిపిసి లుండె
రామగుండములూ – కొత్తగూడెములూ
కరెంటు పుట్టిల్లురా తెలంగాణ
కళల వెలుగు సీమరా తెలంగాణ
స్వాతంత్ర సమరం- రోహిల్లా కదనం
తుర్రెబాజ్ ఖాన్ – స్మారక చిహ్నం
అదిలాబాద్ ను జూడు – అడవి బిడ్డల జూడు
రాంజీ గొండులు – కొమురం భీమ్ లు
కాలవాహిని చూడు- కమ్యునిస్టుల జూడు
దొడ్డి కొమురయ్యలు- చాకలైలమ్మలు
నల్ల నరసింహాలు- మగ్దూం మొహియోద్దీన్
ఆరుట్ల చంద్రులు – అనభేరి సింహాలు
బద్ధం ఎల్లారెడ్డి – రావి నారాయణ రెడ్డి
తెలంగాణమంటు – తేజముట్టీ పడుతూ
వీర యోధుల గడ్డరా తెలంగాణ
విప్లవాల సీమరా తెలంగాణ
సబ్బని లక్ష్మీనారాయణ
కరీంనగర్
మొబైల్: 8985251271 ( ఇండియా)
: +16469618893 ( అమెరికా)