Saturday, May 30, 2020
Home > కవితలు > తరంగాలు! – దాస్యం సేనాధిపతి.

తరంగాలు! – దాస్యం సేనాధిపతి.

గతం గుహలో
బందీని నేను!
ఈ చీకటి లోంచి
బయట పడేదెలా?
నిజంగా ఇది చీకటేనా?
ఈ స్మృతులు…
చుక్కలు కావా ?
ఈ కెరటాలు
గుండె అంచుల్ని
తాకుతున్నాయి!
కాసేపట్లో…
కళ్ల తూముల్లోంచి
దూకుతాయేమో!
అప్పుడు గాని
గతవర్తమానాలు
ముడిపడవు!

-దాస్యం సేనాధిపతి.

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!