Saturday, February 22, 2020
Home > కవితలు > తెలంగాణ వైభవం-పార్ట్ 3

తెలంగాణ వైభవం-పార్ట్ 3

ఆదిలాబాద్ జిల్ల – అడవి బిడ్డల జిల్ల
రమణీయ కుంతాల – రమ్యమైన జిల్ల

గౌతమికి దక్షిణం – సబ్బినాడు క్షేత్రం
ఎలగందుల ఖిల్ల – కళల కరీంనగర్

కాకతీయుల కోట – అది వరంగల్లు
సంగీత సాహిత్యం- అది విరాజిల్లు

నేటి నిజామబాద్ – ఇందూరు నగరం
వాసిగాంచిన నేల – బోధన్ క్షేత్రం

ఖమ్మం మెట్టు సీమ – కవిత కిన్నెరసాని
బద్రాద్రి రామన్న -కొత్త వెలుగులసీమ

నల్లగొండ జిల్ల – ఉద్యమాల ఖిల్ల
ఆచార్య వినోభా – భూదానోద్యమ జిల్ల

మెదక్ కొండాపూర్ – ప్రాచీన చిహ్నాలు
తెల్లాపురం అది – “తెలుంగణ’ పదం

మహబూబ్నగర్ – అలంపురం గుడులు
పిల్లలా మర్రిల – ప్రకృతి సోయగాల్

రంగారెడ్డి జిల్ల – రాసిగాంచిన జిల్ల
వాసిలో నగరం – విస్తరించిన జిల్ల

హైదరాబాద్ ఇది- హైటెక్ నగరం
నాల్గువందలేళ్ళ – నవీనపట్నం

ఇది తెలంగాణ – మన తెలంగాణ
ఘన తెలంగాణ – మన బతుకు సీమ

-సబ్బని లక్ష్మీనారాయణ, కరీంనగర్

మొబైల్: 8985251271 ( ఇండియా), +16469618893 ( అమెరికా)

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!