ఎమ్ చక్క ఏసి ల కుసోని
ఆగాల్వలికేటోల్లకు ఎమ్
ఎరుక !!!….
మట్టి వాసనఐన….
పల్లెటురి ప్రేమఐన….
నాగలిసాల్ల ను నమ్ముకొని బ్రతికేటోల్లం…
ఎండకు ఎండేటోల్లం…
వాన కు నానేటోల్లం…
యద గాయమైన….
నది ల సాగేటోల్లం….
కన్నీళ్ళను కడుపు
దాసుకునేటోల్లం…
వాన చినుకుల కోసం
దైర్యంగా ఎదురుచుసేటోల్లం….
బాదలేన్నున్న బాటసారి ల
నిత్యప్రయాణీకులం….
కరువస్తే కడుపు మాడేటోల్లం…
ఇంటి ముందుకచేటోల్లం….
నాలుగు ఇత్తులు పెట్టేటోల్లం..
రైతురాజ్యం అని రాజకీయo…
సిగ్గులేని యదవలు నీట
మునుగుట ఖాయం!
-బత్తిని కార్తిక్
Facebook Comments