Monday, February 24, 2020
Home > కవితలు > కార్మి”కులం” -బత్తిని కార్తిక్

కార్మి”కులం” -బత్తిని కార్తిక్

కలలేమీ లేవు కళ్ళల్లో..
కడుపునిoడితే చాలు
ఏ పూట కు ఆ పూట….

ఊళ్ళో పనులేమి లేక
పట్నలకై పయణం….
పొట్టనిండలేక
మనసంత గరం గరం…

అడ్డమీద కూలీ అవతారం….
బిడ్డల బ్రతుకులు ఎటో దూరం…..

మరుగున పడుతున్న మమకారం…
ఇది మాయమర్మలతో మాసిన కాలం..

సిమెంట్ పూతలం మేమే…
కరెంట్ స్తంభాలం మేమే….
నడి రోడ్డు పై మురికి కాలువలం…
రింగురోడ్డు పై భారీ వంతెనలం….

ప్లడ్ లైట్ ల మెరుపులo మేమే…
పాతరేసిన రైతన్న నాగళ్ళం మేమే…
బట్టలు నేసే చేనేత మగ్గాలం…
మురికి కి ని మోసే బహుబలులం…..

నింగి కీ నేల కు నిచ్చెనలం….
ప్రపంచమంతా మాదే ధళo..

ఎగిరే పిట్ట కు మేమే దోస్తులం…
ఎదిగే లేగదూడకు ఆప్తులం….

పని దొరికితే సంబురం ….
పండగలస్తేనే మది మారం….

-బత్తిని కార్తిక్

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!